Adani Cement: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న ఉమియా ధామ్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయానికి అదానీ సిమెంట్, దాని అనుబంధ సంస్థ PSP ఇన్‌ఫ్రా సహకారంతో పునాది వేశారు. ఇది ఒక ఇంజినీరింగ్ అద్భుతమనే చెప్పాలి. ఎందుకంటే, ఈ రికార్డు సృష్టించిన పునాదిని కేవలం 54 గంటల్లోనే ఎలాంటి అంతరాయం లేకుండా పూర్తి చేశారు. ఈ ప్రాజెక్ట్‌లో 24,100 క్యూబిక్ మీటర్ల ECO Max XM45 గ్రేడ్ లో కార్బన్ కాంక్రీట్‌ను ఉపయోగించారు. ఇది అదానీ సిమెంట్ తయారు చేసిన ఒక ప్రత్యేకమైన, సుస్థిర మిశ్రమం. ఇంత పెద్ద మొత్తంలో కాంక్రీట్‌ను ఉపయోగించడానికి 26 రెడీ మిక్స్ కాంక్రీట్ ప్లాంట్లు, 285 కు పైగా ట్రాన్సిట్ మిక్సర్లు సమన్వయంతో ఈ పని సాధ్యమైంది.
Andhra King Thaluka : ఆంధ్ర కింగ్ తాలూకా నుండి.. బర్త్‌డే కానుకగా ఉపేంద్ర వింటేజ్ లుక్
ఈ రికార్డు పనికి 600 మందికి పైగా కార్మికులు, సాంకేతిక నిపుణులు మూడు రోజుల పాటు షిఫ్టుల్లో పని చేసి పునాది నిర్మాణాన్ని నిరంతరాయంగా పూర్తి చేశారు. దీనితో పునాదికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూశారు. ఈ పునాది 450 అడుగుల పొడవు, 400 అడుగుల వెడల్పు, 8 అడుగుల లోతుతో ఉంటుంది. ఇది 504 అడుగుల ఎత్తైన జగత్ జననీ మా ఉమియా ఆలయానికి మద్దతుగా 1,551 స్తంభాలను కలిగి ఉంటుంది.
ANR : 101 ఏళ్ల ఏఎన్ఆర్ జ్ఞాపకార్థం.. అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్
అదానీ సిమెంట్ ఉపయోగించిన ఈ ECO Max X కాంక్రీట్ మిశ్రమం ఈ ప్రాజెక్ట్‌కు ఓ ప్రత్యేక ఆకర్షణ. ఇందులో 66 శాతం సప్లిమెంటరీ సిమెంటేషియస్ మెటీరియల్ ఉండడం వల్ల కార్బన్ క్వాంటిటీ దాదాపు 60% తగ్గుతుంది. అంతేకాకుండా, కూల్‌క్రీట్ అనే ప్రత్యేక సూత్రాన్ని ఉపయోగించడం వల్ల కాంక్రీట్ ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంచబడింది. ఇది నిర్మాణంపై వేడి తీవ్రతని తగ్గిస్తుంది. పునాదిలో ఉంచిన థర్మోకపుల్స్ దాని ఉష్ణోగ్రత, మన్నికను నిరంతరం పర్యవేక్షిస్తాయి.