టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న అవైటెడ్ ఎంటర్టైనర్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా. దర్శకుడు మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రామ్ తన అభిమాన హీరోకి వీరాభిమానిగా కనిపించబోతున్నారు. ఆ హీరోగా రియల్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించడం సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ.
Also Read : Kiss : కవిన్.. రొమాంటిక్ కామెడీ ‘కిస్’ తెలుగు ట్రైలర్ అవుట్!
నేడు ఉపేంద్ర జన్మదినం సందర్భంగా మేకర్స్ ఓ సాలిడ్ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో ఆయనను వింటేజ్ లుక్‌లో చూపించగా, ఇది చూసిన అభిమానులు ఫుల్ ఎగ్జైట్ అయ్యారు. ఈ పోస్టర్‌తో ఉపేంద్ర లుక్ ఎలా ఉండబోతుందో క్లారిటీ వచ్చేసింది. సమాచారం ప్రకారం, ఉపేంద్ర పాత్రలో ఇంట్రెస్టింగ్ షేడ్స్‌తో పాటు బలమైన ఎమోషనల్ సీన్స్ కూడా ఉండబోతున్నాయి. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు హైలెట్ అవుతుందని యూనిట్ చెబుతుంది. ఇక ఈ సినిమాకు వివేక్–మెర్విన్ సంగీతం అందిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. భారీ స్థాయి ప్రొడక్షన్ వాల్యూస్‌తో రూపొందుతున్న ఈ మూవీపై టాలీవుడ్‌లో మంచి బజ్ నెలకొంది. మొత్తనికి ఆంధ్ర కింగ్ తాలూకా నుంచి బయటకు వస్తున్న ప్రతి అప్‌డేట్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. ఉపేంద్ర వింటేజ్ లుక్ మాత్రం అభిమానులకు స్పెషల్ బర్త్‌డే గిఫ్ట్‌గా నిలిచిపోయింది.