Pawan Kalyan : ఆది సినిమాలో తొడగొట్టు చిన్న అనే డైలాగ్ తో పేరు తెచ్చుకున్న నటుడు ఫిష్ వెంకట్. తన కెరీర్లో ఇప్పటికే 100 కి పైగా సినిమాల్లో హాస్యనటుడిగా, విలన్ గా నటించారు. ఫిష్ వెంకట్ అనేక సినిమాల్లో తన కామెడీతో నవ్వులు పూయించారు. సినిమాల్లో బాగా ఎదిగిన ఫిష్ వెంకట్ ఇప్పుడు దయనీయ స్థితిలో ఉన్నాడు. ఒకప్పుడు చాలా మందికి దానం చేసిన ఫిష్ వెంకట్ ఇప్పుడు చాలా దుర్భర జీవితం గడుపుతున్నారు. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ఫిష్ వెంకట్ ని ఇంటర్వ్యూ చేసింది. ఫిష్ వెంకట్ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. అతని కుడి కాలు పూర్తిగా దెబ్బతింది. ప్రస్తుతం రాంనగర్ లోని తన ఇంట్లో ఫిష్ వెంకట్ దుర్భర జీవితాన్ని గడుపుతున్నాడు. ఫిష్ వెంకట్ తన బాధలను పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు.
Read Also:Book Exhibition: నేటి నుంచి విజయవాడ పుస్తక మహోత్సవం.. 294 స్టాళ్లు ఏర్పాటు!
ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చలించిపోయారు. ప్రస్తుతం పవన్ ఈ రెండు రంగాల్లో కూడా బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే పవన్ నిజ జీవితంలో ఎంతోమంది సినీ నటులకు ఎన్నోమార్లు ఆర్ధిక సాయం చేసిన ఘటనలు చాలా ఉన్నాయి. అలాంటి పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా ఫిష్ వెంకట్ కి ఆర్ధిక సాయం అందించిన ఘటన బయటకి వచ్చింది.
పవన్ కళ్యాణ్ స్టైల్లో న్యూ ఇయర్ విషెస్ ….
కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఫిష్ వెంకట్ ని ఆదుకున్న పవన్….వెంకట్ గారి నోట ప్రతి అక్షరం మనల్ని కదలిస్తుంది pic.twitter.com/VLHiKtQmdp
— Political Missile (@TeluguChegu) January 1, 2025
Read Also:AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలు ఇవే!
గత కొన్నాళ్ల నుంచి ఫిష్ వెంకట్ కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు. తన భార్య మాట విని పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడితే మొత్తం కళ్యాణ్ గారు చూసుకుంటా అన్నారు.. వెంటనే ఆర్ధిక సాయంగా రూ.2 లక్షలు తన కోసం జమ చేశారు. తనకు ఈ కష్టకాలంలో ఆదుకున్న పవన్ కళ్యాణ్, తన కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నానని ఫిష్ వెంకట్ఎ మోషనల్ గా మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.