Acid Attack : ప్రేమోన్మాది ఘటనలు మనం తరచుగా చూస్తూనే ఉంటాం, అయితే ఈసారి పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు లో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రేమతో సంబంధం లేకుండా, ఒక యువతీ యువకుడిపై యాసిడ్ దాడి చేసింది. తృటిలో తప్పించుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించి రక్షణ కోరడంతో ఈ సంఘటన సంచలనంగా మారింది. జయకృష్ణ అనే యువకుడు భీమవరంలో ఓ బట్టల దుకాణంలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. విజయవాడకు చెందిన రేష్మ అనే యువతితో అతనికి పరిచయం ఏర్పడి, ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. స్నేహాన్ని ఉపయోగించుకుని, రేష్మ జయకృష్ణ నుంచి పలు దఫాలుగా డబ్బులు తీసుకుంది. అయితే ఆమె డబ్బు తిరిగి చెల్లించకపోవడంతో, జయకృష్ణ తన డబ్బులు ఇవ్వాలని ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. అప్పు ఇచ్చిన డబ్బు తిరిగి చెల్లించాల్సిన బాధ్యత తప్పించుకోవాలని భావించిన రేష్మ ఒక పథకాన్ని రచించింది. డబ్బు తిరిగి ఇస్తానని చెప్పి, జయకృష్ణను పాలకోడేరు హైస్కూల్ వద్ద కలవాలని కోరింది.
Daggubati Purandeswari : పీడిఎస్ పై పవన్ కల్యాణ్ చర్యలు సరైనవే
సమయానికి హైస్కూల్ వద్దకు చేరుకున్న జయకృష్ణను రేష్మ బుర్ఖా ధరించి కలిసింది. అనుమానం రాకుండా అతనికి దగ్గరగా వెళ్లి, తన వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను అతనిపై పోసేందుకు ప్రయత్నించింది. అయితే అప్రమత్తమైన జయకృష్ణ దాడి నుంచి తప్పించుకున్నాడు. ఈ సంఘటన నవంబర్ 6న జరిగింది. అయితే.. బాధితుడు ఇటీవల పాలకోడేరు పోలీసులను ఆశ్రయించి, రేష్మపై ఫిర్యాదు చేశాడు. అప్పు ఇచ్చిన డబ్బు ఇవ్వాలని అడగగా ఆమె దాడి చేసిందని, తనకు రక్షణ కల్పించి డబ్బు తిరిగి ఇప్పించాలని కోరాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఈ సంఘటనతో విస్తృతంగా చర్చ నడుస్తోంది.
RC16 Divyenddu: చరణ్ కోసం మున్నా భయ్యా.. ఏం ప్లాన్ చేశావ్ బుచ్చిబాబు?