RC16 Divyenddu: సంక్రాంతి కానుకగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. క్రేజీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సినిమా విడుదలకు సంబంధించి పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఇక గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో రామ్ చరణ్ తన తదుపరి సినిమా ఆర్‌సి 16 షూటింగ్లో పాల్గొనడానికి సన్నద్ధమయ్యాడు. ఈ నేపథ్యంలో సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం హీరో రామ్ చరణ్ కడప దర్గాకు వెళ్లిన సమయంలో ఆయన వెంట బుచ్చిబాబు కూడా వెళ్లి అక్కడ సినిమా సంబంధించిన స్క్రిప్టుకు పూజలు నిర్వహించారు. ఆ తర్వాత కర్ణాటకలోని ప్రసిద్ధ ఆలయంలో కూడా పూజలు నిర్వహించాడు. ఇకపోతే, తాజాగా తనకి ఇష్టమైన రోల్ ని పరిచయం చేయబోతున్నట్లు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో భాగంగానే సోషల్ మీడియా ద్వారా ఆర్‌సి 16 సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను విడుదల చేశారు.
Also Read: Geetha LLB: ఓ డైనమిక్ అమ్మాయి కథగా రాబోబోతున్న గీత ఎల్ఎల్‌బి
ఈ పోస్టర్లో దివ్యేందు శర్మ రగ్గుడ్ లుక్కుతో కనిపిస్తున్న పోస్టురును విడుదల చేస్తూ వెల్కం ఆన్ బోర్డ్ దివ్యేందు అంటూ తెలిపారు. మా భయ్యా.. మీ భయ్యా.. మున్నా భయ్యా అంటూ ఆర్‌సి 16 సినిమాలోకి ఆహ్వానిస్తున్నట్లుగా పోస్టర్ ను విడుదల చేశారు. డైరెక్టర్ బుచ్చిబాబు తనకి ఇష్టమైన రోల్ విడుదల చేస్తున్నట్లుగా తెలుపుతూ.. ఈ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ని బట్టి చూస్తే దివ్యేందు శర్మ సినిమాలో కీలక రోల్ పోషిస్తున్నట్లు అర్థమవుతుంది. దివ్యేందు శర్మ అంటే ఎవరు గుర్తుపట్టరేమో గాని మున్నా భయ్యా అంటే గుర్తుపట్టని వారు ఉండరు. అమెజాన్ లో రిలీజ్ అయిన మీర్జాపూర్ వెబ్ సిరీస్ లో తన దైనా నటనతో డైలాగ్ డెలివరి తో మున్నా భయ్యా సెపరేట్ ఫ్యాన్ బేస్ ను ఏర్పరుచుకున్నాడు. మీర్జాపూర్ సిరీస్ తో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న దివ్యేందు ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.
Our Bhayya…
Your Bhayya…
MUNNA BHAYYA!Welcome onboard dear @divyenndu brother 🤍🤗
Let’s rock it💥#RC16 pic.twitter.com/55r3LeAzp7— BuchiBabuSana (@BuchiBabuSana) November 30, 2024