నెల్లూరు జిల్లా రాజకీయాలు క్షణక్షణం మారిపోతున్నాయి. ఒకవైపు ఆనం రామనారాయణరెడ్డి, మరోవైపు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ధిక్కారస్వరం వినిపిస్తున్నారు. కోటంరెడ్డికి ప్రభుత్వం షాకిచ్చింది. ఆయన సెక్యూరిటీని 2+2 నుంచి 1+1 కి తగ్గించింది. ఇదిలా ఉంటే… కోటంరెడ్డిపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తాజాగా కావలి. ఎం.ఎల్.ఏ.రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కోటంరెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ వీడటం చాలా బాధాకరమైన విషయం.ఆయన తోడేళ్ళను నమ్మి వెళుతున్నాడు. ఆయన జీవితం ఎలా అవుతుందో తెలియదన్నారు.
Read Also: Grenades House: ఇంటికి లైట్లు పెట్టుకుంటారు.. కానీ వీడు చుట్టూ గ్రెనేడ్లు పెట్టుకున్నాడు
మన వైసీపీ ఎమ్మెల్యేలు గడపగడపకు సరిగ్గా తిరుగుతున్నామా లేదా అనే విషయంలో వీడియోలు తీస్తుంటారు.ఆ విషయంలో ఏదైనా శ్రీధర్ రెడ్డి పొరపాటు చేసి ఉండవచ్చు దానికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మందలించి ఉండవచ్చు. దానికే ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా? ఎన్నో రోజులు కలిసి మెలిసి ఉన్నాము. చంద్రబాబు లాంటి తోడేళ్లతో పోకుండా ఉండాలన్నారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. బతికున్నంత కాలం జగనన్నతో నిలబడతాను అన్నావు. గతంలో నా ప్రాణం ఉన్నంతవరకు జగన్మోహన్ రెడ్డి తోనే నిలబడతాను అన్నావు. నేను జగన్మోహన్ రెడ్డికి దూరమైతే నా ప్రాణం పోయినట్లే అని శ్రీధర్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఆ మాట ఏమైందో అన్నారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి.
Pakistan: సైన్యం, న్యాయవ్యవస్థలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఐదేళ్ల జైలు శిక్ష