ACB: ఏసీబీ అధికారుల సోదాలు.. కిటికీ నుంచి రూ. 2 కోట్లు బయటపడేసిన అవినీతి అధికారి
- ఏసీబీ అధికారుల సోదాలు
- కిటికీ నుంచి రూ. 2 కోట్లు బయటపడేసిన అవినీతి అధికారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజలకు సేవా చేయాల్సిన ప్రభుత్వాధికారులు లంచాలకు పడగలెత్తుతున్నారు. కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారు. అవినీతి అధికారులపై ఏసీబీ కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ వారిలో మాత్రం మార్పు రావడం లేదు. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో లంచం పుచ్చుకుంటూ పట్టుబడుతున్నారు. తాజాగా మరో అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కాడు. కాగా ఏసీబీ అధికారులు సోదాలకు వచ్చారన్న విషయం తెలిసి కిటికీలోంచి ఏకంగా రూ. 2 కోట్లను బయటపడేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.
Also Read:Balakrishna : అది నా అదృష్టం.. ఎన్టీఆర్ నేషనల్ అవార్డుపై బాలకృష్ణ ఎమోషనల్..
Also Read
- Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
- ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
- Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
- Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే ఆరోపణలపై భువనేశ్వర్ గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ ఇంజనీర్ బైకుంఠనాథ్ సారంగి అంగుల్‌లోని నివాసం, రాష్ట్రంలోని మరో మూడు ప్రదేశాలతో సహా నాలుగు చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించారు ఏసీబీ అధికారులు. అంగుల్, పూరి, కటక్, దెంకనల్ విజిలెన్స్ విభాగాలు సంయుక్తంగా ఈ దాడులను నిర్వహిస్తున్నాయి. చీఫ్ ఇంజనీర్ బైకుంఠనాథ్ షాడంగి ఇంట్లో విజిలెన్స్ బృందం రూ.2 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. అంగుల్‌లోని అతని ఇంటి నుంచి రూ.90 లక్షలు, రాజధానిలోని అతని నివాసం నుంచి రూ.1.10 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.
Also Read:Kamal Haasan: ‘‘తప్పు చేస్తేనే క్షమాపణ చెబుతా’’.. కన్నడ వివాదంపై కమల్ హాసన్..
అంగుల్‌లోని విజిలెన్స్ ప్రత్యేక న్యాయమూర్తి జారీ చేసిన సెర్చ్ వారెంట్ ఆధారంగా, ఒడిశా విజిలెన్స్ విభాగం నేతృత్వంలోని ఒడిశా విజిలెన్స్, భువనేశ్వర్, పిపిలి (పూరి)లోని 7 ప్రదేశాలలో 8 మంది డిఎస్పీలు, 12 మంది ఇన్‌స్పెక్టర్లు, 6 మంది ఎఎస్‌ఐలు, ఇతర సహాయక సిబ్బందితో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. చీఫ్ ఇంజనీర్ బైకుంఠనాథ్ షాడంగి రెండు రోజుల్లో పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఇంజనీర్ ఇంటిపై దాడి జరిగినప్పుడు, విజిలెన్స్ అధికారులు వచ్చేసరికి సారంగి తన ఫ్లాట్ కిటికీలోంచి నగదు కట్టలను విసిరి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఆ డబ్బును తరువాత సాక్షుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ओडिशा में इंजीनियर के घर विजिलेंस की टीम ने छापामारी की। जैसे ही इंजीनियर को रेड की जानकारी मिली वह घर की खिड़की से नगदी फेंकने लगा। इंजीनियर के घर से टीम ने 2 करोड़ रुपये जब्त किए हैं।#OdishaNews #BreakingNews pic.twitter.com/MiYWmNYWE0
— Piyush Pandey (@piyush_bebak_) May 30, 2025
తాజావార్తలు
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!