Balakrishna : తెలంగాణ ప్రభుత్వం పదకొండేళ్ల తర్వాత సినిమా అవార్డులను గద్దర్ పేరుతో ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా 2014 నుంచి 2023 వరకు ఉత్తమ చిత్రాలకు అవార్డులను ప్రకటించారు. ఇందులోనే స్పెషల్ అవార్డులుగా ఆరు అవార్డులను ప్రకటించారు. అందులో ఎన్టీఆర్ జాతీయ అవార్డును నందమూరి బాలకృష్ణకు ప్రకటించారు. ఈ అవార్డుపై బాలకృష్ణ స్పందించారు. ఎన్టీఆర్ అవార్డు రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.
Read Also : Raghunandan Rao: యుద్ధం చేసేటోనికి తెలుస్తుంది.. సీఎంపై బీజేపీ ఎంపీ ఫైర్..!
‘ఓవైపు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇంకో వైపు ఎన్టీఆర్ నట ప్రస్థాననానికి 75 ఏళ్లు పూర్తయిన అమృత ఘడియాలు ఉన్నాయి. ఇలాంటి అద్భుతమైన సమయంలో ‘ఎన్టీఆర్ జాతీయ అవార్డు’ నాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ దేవుడి వరంగా, నాన్నగారి ఆశీస్సులుగా అనుకుంటున్నాను. ఇంతటి ప్రతిష్టాత్మకమైన అవార్డుకు నన్ను ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
సీఎం రేవంత్ రెడ్డి గారికి, జ్యురీకి ధన్యవాదాలు. ప్రపంచ నలమూలలా ఉన్న తెలుగు ప్రజలు నన్ను దీవించడం వల్లే నాకు ఈ అవార్డు వచ్చిందని అనుకుంటున్నాను. మీ ప్రేమ, అనురాగం నా మీద ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను’ అని బాలకృష్ణ ఎమోషనల్ గా స్పందించారు.
Read Also : Manoj : ఆయన కొడుకొచ్చాడని చెప్పు.. ‘భైరవం’ వేళ మనోజ్ పోస్ట్..