Kamal Haasan: ‘‘తప్పు చేస్తేనే క్షమాపణ చెబుతా’’.. కన్నడ వివాదంపై కమల్ హాసన్..
- తప్పు చేస్తేనే క్షమాపణ చెబుతా..
- కన్నడ వివాదంపై క్షమాపణలు చెప్పడానికి కమల్ హాసన్ నిరాకరణ..
- ‘‘కన్నడ తమిళం నుంచి పుట్టింది’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kamal Haasan: స్టార్ యాక్టర్ కమల్ హాసన్ ఇటీవల తన కొత్త సినిమా ‘‘థగ్ లైఫ్’’ ప్రమోషన్ కార్యక్రమంలో కన్నడ భాష గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ‘‘కన్నడ భాష తమిళం నుంచి పుట్టింది’’ అని ఆయన వ్యాఖ్యానించడంపై కన్నడిగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం కర్ణాటకలో రాజకీయ రంగు పులుముకుంది. కమల్ హాసన్ సినిమాను రాష్ట్రంలో బ్యాన్ చేస్తామని రాజకీయ పార్టీలు హెచ్చరించాయి.
Read Also: Rajnath Singh: ‘‘అలా జరిగితే పాకిస్తాన్ 4 భాగాలుగా విడిపోయేది’’..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
అయితే, తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పడానికి కమల్ హాసన్ నిరాకరించారు. తన వ్యాఖ్యలు తప్పు అని భావిస్తేనే క్షమాపణలు చెప్పేవాడిని సమర్థించుకున్నారు. ‘‘నాకు గతంలో బెదిరింపులు వచ్చాయి. కానీ ప్రేమ ఎప్పుడూ గెలుస్తుంది. కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, కేరళ పట్ల నాకు ఉన్న ప్రేమ నిజం. ఒక ఎజెండా ఉన్నవారు మాత్రమే వేరే విధంగా అనుమానిస్తారు’’ అని ఆయన అన్నారు. ఇది ప్రజాస్వామ్యమని, తాను చట్టాన్ని, న్యాయాన్ని నమ్ముతానని చెప్పారు.
మరికొన్ని రోజుల్లో డీఎంకే మద్దతుతో రాజ్యసభలో అడుగుపెట్టనున్న కమల్ హాసన్ ఈ వ్యాఖ్యలతో దుమారాన్ని రేపారు. భాషను అమితంగా ప్రేమించే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఇది పెద్ద వివాదంగా మారింది. కన్నడ రక్షణ వేదిక అతడిపై కేసు నమోదు చేసింది. కర్ణాటకలో సినిమా బిజినెస్ కావాలి, అయినా కూడా కన్నడను అవమానిస్తారా..? అని కన్నడ ప్రజలు మండిపడుతున్నారు. కన్నడ కన్నా తమిళం గొప్పదనే ప్రయత్నం చేస్తున్నాడని కమల్ హాసన్‌పై విరుచుకుపడుతున్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..