Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhijeet Dipke: అరెస్ట్ నుంచి విడుదలైన వెంటనే కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కన్వీనర్ అభిజీత్ దిప్కే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధానిగా మోడీ భారతదేశానికే అవమానం అని, దేశం ఇంతటి భయస్తుడు, బెదిరించే ప్రధానిని ఎప్పుడూ చూడలేదని మండిపడ్డారు. దీప్కే శనివారం ఢిల్లీ విమానాశ్రయంలో పోలీసులు తనను అదుపులోకి తీసుకున్న తర్వాత, దాదాపు 24 గంటల అనంతరం కోర్టు ఆదేశాలతో ఆదివారం ఉదయం విడుదలయ్యారు. బయటకు రాగానే ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, సీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను దేశద్రోహి అని పేర్కొన్నారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు. “జ్ఞానేష్ కుమార్ ఒక దేశద్రోహి. అతను రాజీనామా చేయాల్సింది. ఇలాంటి దేశద్రోహులను తొలగించడానికి నా జీవితాంతం జైలులో గడపడానికైనా నేను సిద్ధం.” అని రాంకా రాసుకొచ్చారు.
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఢిల్లీలో సీజేపీ భారీ నిరసన చేపట్టింది. ఈ క్రమంలో ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన ఏఐ 2428 విమానం నుంచి అభిజీత్ దిప్కేతో పాటు పార్టీ కో-కన్వీనర్లు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలను పోలీసులు విమానం లోపలి నుంచే అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ అధికారులు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సూచనల మేరకు విమానాన్ని రిమోట్ బే వద్దకు తరలించి ఈ అరెస్టులు చేశారు. అయితే, ఆ తర్వాత విచారణ జరిపిన ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ వారిని విడుదల చేయడానికి ఆదేశించారు. వాస్తవానికి.. ఓ ఏడాది పాటు శాంతిభద్రతలకు భంగం కలిగించకూడదు” అనే షరతుపై సీజేపీ లీగల్ హెడ్ తెలిపిన వివరాల ప్రకారం వారికి ముందస్తు విడుదల లభించింది.
Also Read
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
ఢిల్లీలో శనివారం నాటి ఆందోళనల్లో దాదాపు 7,000 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ తమ పోరాటం ఆగదని సీజేపీ స్పష్టం చేసింది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడంతో పాటు జంతర్ మంతర్ వద్ద నిరసనను కొనసాగించేందుకు సిద్ధమైంది. నాయకులను అరెస్ట్ చేసినంత మాత్రాన వెనక్కి తగ్గేది లేదని, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసే వరకు ఆందోళన కొనసాగుతుందని పార్టీ నాయకుడు అజింక్య షిండే స్పష్టం చేశారు. మరోవైపు, సీజేపీ పిలుపుతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. సెంట్రల్ ఢిల్లీని పూర్తిగా సీల్ చేసి, జంతర్ మంతర్‌ను మూసివేశారు. నగరం చుట్టూ సరిహద్దుల వద్ద భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసి, 30 కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించారు. అలాగే మెట్రో, రైలు సేవలను పూర్తిగా నిలిపివేయడంపై సుప్రీంకోర్టు ఉత్తర్వులను అధికారులు ఉల్లంఘించారంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించనుంది. ఈ పరిణామాల మధ్య ఢిల్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
తాజావార్తలు
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!