Delhi Liquor case: లిక్కర్ కేసులో ఈడీ సంచలన నిర్ణయం.. దేశ చరిత్రలో ఇదే తొలిసారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సంచలన నిర్ణయం తీసుకుంది. వ్యక్తులను కేసుల్లో ఇరికించడం సహజం.. అలాంటిది ఏకంగా ఆమ్ ఆద్మీ పార్టీనే నిందితుడిగా చేర్చనున్నట్లు హైకోర్టుకు ఈడీ తెలియజేసింది. ఒక రాజకీయ పార్టీని ఒక కేసులో నిందితుడిగా చేర్చడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. మద్యం పాలసీ కేసులో ఆప్‌ను నిందితుడి మారుస్తామని దర్యాప్తు సంస్థ కోర్టుకు తెలిపింది.
ఇది కూడా చదవండి: TDP vs YCP Fight: వాదంపల్లిలో ఉద్రిక్తత.. నీళ్లు పట్టుకునే విషయంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ
Also Read
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
- Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో సహా తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువుర్ని ఈడీ అరెస్ట్ చేసింది. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను, అటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ఈడీ కస్టడీ అనంతరం కవితను, కేజ్రీవాల్‌ను తీహార్ జైలుకు తరలించారు.
ఇది కూడా చదవండి: Bhatti Vikramarka: ప్రజలు ఇండియా కూటమి వైపే మొగ్గు చూపారు..
అయితే దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో ఒక రాజకీయ పార్టీ అధినేతగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2న తిరిగి సరెండర్ కావాలని ఆదేశించింది. ప్రస్తుతం ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. తాజాగా ఈడీ.. ఆప్‌కు భారీ షాకిచ్చింది. ఏకంగా పార్టీనే నిందితుడిగా చేర్చుతున్నట్లు న్యాయస్థానానికి తెలియజేసింది. దీనిపై ఆప్ శ్రేణులు ఎలా స్పందిస్తారో చూడాలి.
ఇది కూడా చదవండి: AP Elections 2024: అర్ధరాత్రి దాటాక కూడా కొనసాగిన ఓటింగ్.. తుది పోలింగ్ శాతం ఎంతంటే?
- Tags
- APP
- Court
- Delhi liquor case
- ED
- kejriwal
తాజావార్తలు
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!