Aamir Khan: బాలీవుడ్ ఖాన్స్‌లో ఆమిర్‌ఖాన్ ఒకరు. తాజాగా ఆయన ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆక్ష్న కీలక పాత్రలో నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ రూ.200 కోట్లకు పైగా నష్టాలను మిగిల్చిందని ఈ బాలీవుడ్ బడాఖాన్ చెప్పారు. మీకు తెలుసా ఆమిర్ ఖాన్ ప్లాపుల పరంపర ఎక్కడి నుంచి మొదలు అయ్యిందో.. ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ అనే సినిమా నుంచి. దీని కన్నా ముందు ఆయన తన సినీ కెరీర్‌లో పెద్దగా అపజయాలను చూసిన సందర్భాలు చాలా తక్కువ. కానీ ఈ సినిమా తర్వాత వరుస ఫ్లాప్లను ఎదుర్కొంటున్నారు. సరే ఆయన ఈ ఇంటర్వ్యూలో ‘లాల్ సింగ్ చడ్డా’ గురించి ఏం మాట్లాడారో తెలుసుకుందాం..
READ ALSO: Pragathi : నటి ప్రగతి పేరుతో భారీ మోసం..
“దంగల్‌కు ఇండియాలో రూ.385 కోట్లు వచ్చాయి. ‘లాల్ సింగ్ చడ్డా’ కనీసం రూ.100-200 కోట్లు వస్తాయని అనుకున్నా. ఈ అంచనాతోనే బడ్జెట్ వేసుకుని, సెట్స్‌పైకి వెళ్లాం. ‘ఒక విషయం గుర్తు పెట్టుకోండి. మీ సినిమా రూ.120 కోట్లు వసూలు చేస్తుందని మీరు భావించినప్పుడు బడ్జెట్ రూ.80 కోట్లకు మించకుండా ప్లాన్ చేసుకోవాలి. రూ.50-60 కోట్ల మధ్య ఉంటేమరీ మంచిది’ అని ఆయన అన్నారు. కానీ ఈ సినిమా ఫుల్ రన్ పూర్తయ్యేనాటికి రూ.200 కోట్ల నష్టాన్ని మిగిల్చిందని చెప్పారు.
“నేను నిర్మించే ప్రతి సినిమా బడ్జెట్ విషయంలో జాగ్రత్తగా ఉండటం నాకు అలవాటు. కథకు ఏది అవసరమో దాన్నే ఎంపిక చేసుకుంటాను. ఈ సినిమా చేయడం వల్ల ఇంత లాభం వస్తుందనే విషయంపై కాకుండా నష్టాల పాలవ్వకుండా చూడటమే నా ప్రథమ కర్తవ్యం. దురదృష్టవశాత్తూ ‘లాల్ సింగ్ చడ్డా’ విషయంలో దానిని విస్మరించినట్లు ఆయన పేర్కొన్నారు. దీనికి కారణం అప్పటివరకూ నేను చేసిన సినిమాలన్నీ హిట్ మీద హిట్ కొట్టడంతో ఈ సినిమా విషయంలో అతి నమ్మకం ఎక్కువైందని చెప్పారు. దీంతో చాలా రోజుల తర్వాత తన అంచనా తప్పిందని ఇంటర్వ్యూలో బయటపెట్టారు. బడ్జెట్ విషయంలో పరిమితులు పెట్టుకోకపోవడంతో ఈ సినిమా తనకు నష్టాలు మిగిల్చిందని అన్నారు.
దేశంలో కరోనా సమయంలో ఆంక్షలు ఉండటంతో షూటింగ్ విదేశాల్లో చేద్దామని అనుకున్నట్లు ఆయన చెప్పారు. ఇక్కడ బడ్జెట్లో ఎక్కువ మొత్తం ప్రయాణాల మీద ఖర్చు చేశామని, దీంతో ఎక్కువ డబ్బులు వృథా అయ్యాయి అని చెప్పారు. ఆయన ఇక్కడ మరో ఆసక్తికర సంఘటనను చెప్పారు. సినిమాలో భాగంగా చైనాలో టేబుల్ టెన్నిస్‌పై ఒక పెద్ద సీక్వెన్స్ తెరకెక్కించామని, కానీ ఓవరాల్‌గా చేసిన ఫైనల్ ఎడిట్లో ఆ మొత్తం సీక్వెన్స్ తీసేశామని.. ఆ ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరు అయినట్లు చెప్పారు. ఈ సినిమా చర్చల సమయంలోనే ఇది మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ కాదని దర్శకుడు అద్వైత్ చందన్‌కు చెప్పినట్లు పేర్కొన్నారు.
మీకు తెలుసా.. ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమాలో ఆమిర్‌ఖాన్, నాగచైతన్య, కరీనా కపూరాఖాన్, మోనా సింగ్, మానవ్ విజ్ తదితరులు కీలక పాత్ర పోషించారు. వాస్తవానికి ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులకు ఆకట్టుకోలేకపోయింది.
READ ALSO: Rajinikanth: ఆ సంఘటనతో ఇళయరాజా కన్నీళ్లు పెట్టారు: రజనీకాంత్