Pragathi : టాలీవుడ్ నటీనటుల పేరుతో డబ్బులు వసూలు చేయడం గతంలో ఎన్నో చూశాం. ఇప్పటికీ అలాంటివి జరుగుతూనే ఉంటాయి. తాజాగా నటి ప్రగతి విషయంలో ఇలాంటిదే జరిగింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. తన పేరుతో కొందరు డబ్బులు వసూళ్లు చేస్తున్నారంట. తాజాగా ఆమె పోస్టు పెట్టింది. కొందరు నా పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు. సేవా కార్యక్రమాల పేరు చెప్పి నా పేరుతో ఐడీలు క్రియేట్ చేసి డబ్బులు తీసుకుంటున్నారని తెలిసింది. దయచేసి ఇలాంటివి ఎవరూ నమ్మొద్దు. వారికి డబ్బులు ఇవ్వొద్దు అంటూ కోరింది ప్రగతి.
Read Also : Sai Durga Tej : సెకండ్ క్లాస్ లోనే లవ్ చేశా.. రీసెంట్ గా బ్రేకప్ అయింది
నన్ను ఫాలో అయ్యే అభిమానులు ఎవరూ ఇలాంటి స్కామ్ లను నమ్మొద్దు. ఇప్పటికే ఈ స్కామ్ లపై నేను నార్సింగి పోలీసులకు కంప్లయింట్ ఇచ్చాను. కాబట్టి మీరు కూడా ఎవరూ నమ్మకండి. చాలా మంది చదువుకున్న వారే ఇలాంటి స్కామ్ లతో మోసపోతున్నారని తెలిసింది. దయచేసి నమ్మకండి అంటూ కోరింది ప్రగతి. ఆమె ఓ స్క్రీన్ షాట్ ను కూడా షేర్ చేసింది. అందులో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రగతి అని కాంటాక్ట్ ఉంది. అందులో నెంబర్ కూడా కనిపిస్తోంది. ఈ ఫొటో ఇప్పుడు క్షణాల్లోనే వైరల్ అయిపోతోంది. ప్రగతి ఈ మధ్య సినిమాల్లో పెద్దగా కనిపించట్లేదు.
Read Also : Raghava Lawrence : వాళ్లపై నోట్ల వర్షం కురిపించిన లారెన్స్.. ఎందుకంటే..