Aadhi Pinishetty: తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ గుర్తింపును తెచ్చుకున్న నటుడు ఆది పినిశెట్టి మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. సెవెన్ జీ ఫిలిమ్స్ – ఆల్ఫా ఫ్రేమ్స్ వారు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి, అరివళగన్ దర్శకత్వం వహించాడు. అరుణ్ పద్మనాభన్ ఫొటోగ్రఫీని అందిస్తున్న ఈ సినిమాకి జోసెఫ్ ఎడిటర్ గా ఉన్నాడు. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తుండటం విశేషం. నేడు ఆయన తన 40వ పుట్టినరోజును జరుపుకుంటుండటంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు తమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా, ఆది పినిశెట్టి తన నెక్ట్స్ చిత్రాన్ని ఈ సందర్భంగా అనౌన్స్ చేసి అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘వైశాలి’ అనే హార్రర్ మూవీ తెరకెక్కగా, అది తెలుగు-తమిళ భాషల్లో సూపర్ హిట్ సాధించింది. ఇప్పుడు మరోసారి హార్రర్ కథాంశంతో నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు వీరిద్దరూ రెడీ అయ్యారు. ఈ సినిమాకు ‘శబ్దం’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. తమిళంతో పాటు తెలుగులోనూ తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి, రిలీజ్ చేయాలని ఆది భావిస్తున్నాడు.
Need all your best wishes as we begin this new journey today🙏🏼#SABDHAM – The sound that's never heard!
Team #Eeram reunites!@dirarivazhagan @MusicThaman @7GFilmsSiva @Aalpha_frames @Dop_arunbathu @EditorSabu @Manojkennyk @stunnerSAM2 @Viveka_Lyrics @Synccinema pic.twitter.com/rgU5UY43VR— Aadhi🎭 (@AadhiOfficial) December 14, 2022