ప్రతి ఒక్కరికి తమ జీవితంలో ఒక భాగస్వామి అవసరం. అందులోను వారి జీవితంలోకి వచ్చే భాగస్వామి ఇలా ఉండాలి.. అలా ఉండాలి అని కొందరు కలలు కంటుంటారు. కొందరు చదువుకున్న అమ్మాయి కావాలనుకుంటారు. మరికొందరు అందంగా ఉండాలని కోరుకుంటారు. ఇలా రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి. అయితే ఓ వ్యక్తి తనకు కాబోయే భాగస్వామికి ఎలాంటి కండిషన్స్ పెట్టాడో చూస్తే.. మీరు షాకవుతారు. అంతేకాకుండా ఆ వ్యక్తి పెట్టిన షరతులు ఎన్నో తెలిస్తే.. ఆశ్చర్యానికి గురికాక తప్పదు.
Minister Jagdish Reddy: వరదలపై ఎందుకు బురద రాజకీయం…
ఓ నివేదిక తెలిపిన ప్రకారం.. ఓ యువకుడు తన కాబోయే భార్య కోసం రెడ్డిట్‌లో 15 షరతులతో కూడిన పోస్ట్ చేశాడు. మొదటి షరతు ఏమిటంటే.. ఆమె ఎత్తు 5 అడుగుల 6 అంగుళాల కంటే ఎక్కువ ఉండకూడదు. అంతే కాకుండా.. ఎటువంటి పచ్చబొట్టు వేయించుకోకూడదు. అబ్బాయిని కోరుకునే వారు.. కావాలంటే జుట్టుకు రంగు వేసుకోవచ్చు అంటూ మినహాయింపు ఇచ్చాడు. అంతేకాకుండా దానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపాడు.
Tiger Nageswara Rao: ఈ గజదొంగను ఆపుతున్న శక్తులు ఎవరు.. అదికూడా చెప్పండి బ్రో
ఇంకా లిస్ట్ చాలానే ఉంది. అమ్మాయి తన జుట్టుకు రంగు వేయడానికి అనుమతించినప్పటికీ, తన ఎంపిక ప్రకారం మాత్రమే హెయిర్‌స్టైల్ మరియు గోళ్ల ఆకృతిని ఉంచుకోవలసి ఉంటుందని యువకుడు చెప్పాడు. అంతేకాకుండా.. తనపై ఆధారపడకూడదని.. తెలిపాడు. అమ్మాయికి తండ్రితో సంబంధం బాగుండాలి.. కానీ ఏ అబ్బాయి స్నేహితుడు ఉండకూడదన్నాడు. ఆహారం విషయానికొస్తే.. రుచిగా వంటలు చేయాలని తెలిపాడు. ఈ షరతులే కాకుండా.. మరిన్ని షరతులు ఉన్నాయి. ట్రెడిషనల్ దుస్తులు ధరించాలని తెలిపాడు. అంతే కాకుండా సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని తెలిపాడు. అమ్మాయి తన ఇష్టాఇష్టాలను ఏ సెలెబ్రిటీపై తెలపకూడదన్నాడు.
GST Collection: కేంద్ర ప్రభుత్వానికి భారీ ఆదాయం.. ఎంతో తెలుసా..!
ఐతే రెడ్డిట్లో ఈ పోస్ట్ చదివిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు. నువ్వు బాగున్నావు బ్రదర్ అంటూ కొందరు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. అతను చాలా అభద్రతాభావంతో ఉన్నాడు, అతను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు మరికొందరు రాసుకొచ్చారు. మరోవైపు ఈ జన్మలో ఆడపిల్ల దొరకదు అన్నయ్య అంటూ కామెంట్స్ చేస్తున్నారు.