Tiger Nageswara Rao: మాస్ మహారాజా రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ నటిస్తుండగా.. రేణు దేశాయ్ కీలక పాత్రలో నటిస్తోంది. స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 20 న రిలీజ్ కానుందని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. ఇక అందుకు అనుగుణంగానే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక గత కొన్ని రోజులుగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడిందని, కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ త్వరలోనే ప్రకటిస్తున్నారని పుకార్లు షికార్లు చేసాయి. ఇప్పటికే అక్టోబర్ లో విజయ్ లియో, బాలకృష్ణ భగవంత్ కేసరి రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇక వీటితో పాటు టైగర్ నాగేశ్వరరావు రావడం లేదని పుకార్లు బాగా స్ప్రెడ్ కావడంతో మేకర్స్ స్పందించారు.
Raasi Khanna: నేను బరువు తగ్గడానికి నా బాయ్ ఫ్రెండ్ కారణం.. ?
కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ అన్ని ఫేక్ అంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఒక ప్రకటనను కూడా రిలీజ్ చేశారు. “టైగర్ నాగేశ్వరరావు అక్టోబర్ 20 న రిలీజ్ కావడం లేదని కొన్ని నిరాధారమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందులో ఎలాంటి నిజం లేదు. కొన్ని శక్తులు ఇలా కావాలనే పుకార్లు పుట్టిస్తున్నాయి. ఎందుకంటే .. మా సినిమా ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని నెలకొల్పింది. అంతేకాకుండా థియేట్రికల్ ఎకోసిస్టమ్‌లోని కొంతమంది వాటాదారుల నుండి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే ఇలాంటి వదంతులను నమ్మకండి. మీకు మంచి సినిమా ఇవ్వడానికి మేము కష్టపడుతున్నాం. టైగర్ అక్టోబరు 20 నుండి బాక్సాఫీస్ వద్ద వేట ప్రారంభించనుంది” అని చెప్పుకొచ్చారు. ఇక ఈ ప్రకటన చూసాక ఈ గజదొంగను ఆపుతున్న శక్తులు ఎవరు.. అదికూడా చెప్పండి బ్రో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.