కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎలాంటి డిమాండ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. రైల్వేలో గ్రూప్ డీ ద్వారా 32 వేల పోస్టులకు పైగా భర్తీకాన్నున్నాయి. పోస్టల్ డిపార్ట్ మెంట్ లో 21 వేలకు పైగా పోస్టులు భర్తీకానున్నాయి. ఇక ఇప్పుడు కేంద్ర విద్యుత్ సంస్థ కూడా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జాబ్ కోసం ట్రై చేస్తున్న వారు ఈ ఛాన్స్ ను అస్సలు మిస్ చేసుకోకండి.
Also Read:Upamaka Venkateswara Swamy Temple: ఉపమాక వెంకన్న ఆలయాభివృద్ధికి సహకరించాలి: హోంమంత్రి అనిత
ఎన్టీపీసీ ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 400 పోస్టులను భర్తీచేయనున్నారు. అభ్యర్థులు ఈ పోస్టులకు 40 శాతం మార్కులతో బీఈ, బీటెక్ లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 35 ఏళ్లకు మించకూడదు. రిజర్వ్డ్ కేటాగిరి వర్గాల వారికి వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి. ఈ పోస్టుకుల అభ్యర్థులను షార్ట్ లిస్టింగ్, సీబీటీ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
Also Read:Earthquake : ప్రతిరోజూ 1000భూకంపాలు… ప్రపంచంలోని ఈ ప్రాంతం ఎందుకు ఇలా ఇబ్బంది పడుతుంది ?
ఎంపికైన వారికి నెలకు రూ. 55 వేల జీతం ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.300 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు మార్చి 1 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.