Manhole: హన్మకొండ పరిధిలోని కొత్తూరు జెండా ప్రాంతంలో మురుగునీటిని తొలగించే క్రమంలో మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేసిన ఘటనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఒక సిబ్బంది మ్యాన్‌హోల్ క్లీన్ చేసేందుకు అందులో దిగి శుభ్రం చేశాడు. ఈ వీడియోను కొందురు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈవీడియో వైరల్ గా మారింది. ఈ వార్త కాస్త వరంగల్ మేయర్, కమిషనర్ వరకు చేరడంతో ఈఘటనపై తీవ్రంగా పరిగణించారు. ఈ ఘటనకు కారణమైన సంబంధిత శానిటరీ ఇన్‌స్పెక్టర్ భాస్కర్, జవాన్ రవిలను సస్పెండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్, ఇన్‌ఛార్జ్ కమిషనర్ నిపుణుల ఉత్తర్వులు జారీ చేశారు. నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ డ్రైనేజీలోకి దిగి చేతులతో వ్యర్థాలను తొలగించడం శోచనీయమని, ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదన్నారు. జీడబ్ల్యూ ఎంసీ అంతటా అత్యాధునిక పారిశుద్ధ్య విధానాలను అవలంబిస్తున్నట్లు తెలిపారు. కార్మికులపై ఇలాంటి అమానవీయ పనులు చేయడం కుదరదన్నారు. చట్టాలను గౌరవించాలని అధికారులకు సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బల్దియా వ్యాప్తంగా అన్ని డివిజన్లలో పర్యవేక్షణ పటిష్టం చేస్తామన్నారు.
Read also: Terror suspects: హైదరాబాద్ ఉగ్ర కోణం.. వెలుగులోకి కేరళ స్టోరీని మించిన అంశాలు
గతంలో కొన్ని ప్రాంతాల్లో మురుగునీరు శుభ్రం చేసేందుకు, పైపులు శుభ్రం చేసేందుకు మ్యాన్‌హోల్‌లోకి దిగి కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. కార్మికుల రక్షణ ముఖ్యమని, కార్మికులను అన్ని చోట్లా అలా పని చేయించుకోవద్దని.. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కొన్ని పనులు పూర్తి చేయాలని ఉన్నతాధికారులు, మంత్రులు సూచించారు. అయితే కొన్ని చోట్ల ప్రమాదకరమైన మ్యాన్ హోల్స్ లో కూలీలతో పనులు చేయించుకోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారి విమర్శలు రావడంతో బాధ్యులిద్దరిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు.
Telangana 10th results: నేడే టెన్త్ రిజల్స్ .. ntvtelugu.com లో చెక్ చేసుకోండి