సంగారెడ్డి జిల్లా ఆమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాణి నగర్ లో దారుణం చోటుచేసుకుంది. ఉదయం డ్యూటీ కి వెళ్తున్న సమయంలో ముగ్గురు పై శ్రీనివాస్ అనే వ్యక్తి కత్తి దాడి చేశాడు. దీంతో.. సుజాత అనే మహిళ మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్తితి విషమంగా ఉంది. అయితే.. కుటుంబ కలహాలు తోనే దాడి జరిగింది అని పోలీసులు భావిస్తున్నారు. దాడి చేసిన వ్యక్తి భార్య సునీత వాణి నగర్‌లో వాళ్ళ అక్క సుజాత ఇంటి వద్ద ఉండి ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. కుటుంబ కలహాలతో అక్క సుజాత ఇంటికి వచ్చి సునీత వుంటుంది. అయితే.. సునీత భర్త శ్రీనివాస్ చింతల్‌లో నివాసం ఉంటూ స్థానిక అరబిందో పరిశ్రమలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే నేడు బైక్‌పై సునీత.. తన అక్క సుజాత తో పాటు అక్క కొడుకు సాయితో డ్యూటీకి వెళ్తోంది.
Also Read : Pathan Movie Controversy: ‘పఠాన్’కు వివాదంలోకి ప్రముఖ సింగర్.. జనాలు సెన్సిటివ్ గా మారారని వ్యాఖ్య
ఇదే సమయంలో వారి బైక్‌కు రోడ్డుపై ఆపిన శ్రీనివాస్ భార్య సునీతతో వాగ్వాదానికి దిగాడు. ఇదే సమయంలో సునీత అక్క సుజాతతో పాటు సాయి శ్రీనివాస్‌ను వారించడంతో శ్రీనివాస్ ఒక్కసారి తన వెంట తెచ్చుకున్న కత్తితో వారిపై దాడికి పాల్పడ్డాడు. అయితే.. ఈ దాడిలో సునీత అక్క సుజాత అక్కడిక్కడే మృతి చెందింది. సునీత, సుజాత కొడుకు సాయి లను సూరారం మమత ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పఠాన్‌చెరు డీఎస్పీ భీమ్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.