ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజాలో ఓ విచిత్రమైన, బాధాకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ వ్యక్తి తంత్ర మంత్రానికి బలై.. బతికి ఉన్న కోడిపిల్లను మింగేశాడు. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చనిపోయాడు. తొలుత గుండెపోటుతో యువకుడు మృతి చెంది ఉంటాడని వైద్యులు భావించారు. అయితే పోస్ట్‌మార్టం చేయగా గొంతులో చనిపోయిన కోడిపిల్ల కనిపించింది.
పావలా కోడికి..ముప్పావలా మసాలా అనేది పాత సామెత. ఇప్పుడు కాస్త మార్చుకోవాలేమో.. 10 రూపాయల కోడిపిల్లకు 50 రూపాయల టికెట్. ఇది కర్నాటక ఆర్టీసీ వారి లీల. బస్సులో మనతో పాటు లగేజీ తీసుకువెళితే.. లగేజ్ టికెట్ కూడా వసూలు చేస్తాడు కండక్టర్. ఆ లగేజ్ టికెట్ ప్రయాణికుల టికెట్ తో సమానంగా వుండదు. కానీ కేఎస్ఆర్టీసీ వారి తీరే వేరు. సంచిలో కోడిపిల్లను తీసుకువెళితే కూడా టికెట్ తీసుకోవాలన్నాడా కండక్టర్. అది కూడా తక్కువేం కాదు.ఏకంగా…