Medaram Jatara: మేడారం మహాజాతరకు అంకురార్పణ సమర్పించిన తర్వాత మండమెలిగే ఉత్సవాలను నిర్వహించారు. మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఫిబ్రవరి 21వ తేదీ బుధవారం నుంచి ఫిబ్రవరి 24వ తేదీ శనివారం వరకు మేడారం మహాజాతర జరిగింది.
మేడారం మహా జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. చిలుకల గుట్టనుంచి కుంకుమ భరణి రూపంలో బయల్దేరి వచ్చిన సమ్మక్క.. గద్దెకు చేరుకుంది. సమ్మక్కను ప్రధాన పూజారి ప్రతిష్టించారు. సమ్మక్కను గద్దెపై ప్రతిష్టించే సమయంలో లైట్లు నిలిపివేశారు. మరోవైపు.. అమ్మవారిని గద్దెపై ప్రతిష్టించే సమయంలో భక్తుల దర్శనాన్ని నిలిపివేశారు. సమ్మక్కను గద్దెపై ప్రతిష్టించడంతో భారీ ఎత్తున భక్తులు జై సమ్మక్క తల్లి-జై సారక్క తల్లి అంటూ నినాదాలు చేశారు. ఇదిలా ఉంటే.. బుధవారం కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెకు…
Minister Seetakka: సీతక్క - కొండా సురేఖ ఇద్దరు మహిళా మంత్రులు వరంగల్ జిల్లాలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణ బాధ్యతను తమ భుజస్కందాలపై వేసుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోనే ప్రముఖ గిరిజన ఆలయంగా వెలుగొందుతున్న మేడారం సమ్మక్క సారలమ్మ దేవాలయం నీట మునిగింది. గ్రామంలోకి భారీగా వరద నీరు చేరుకుంటోంది. గోవిందరావు పేట మండలంలోని పస్రా, తాడ్వాయి మధ్యలో ఉన్న 163వ నెంబర్ జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహించడంతో కోతకు గురైంది. దీంతో తాడ్వాయి, ఏటూరు నాగారం మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.