Prajwal Revanna: కొడుకు స్కూల్ అడ్మిషన్‌కి వెళ్తే వర్చువల్ సె*క్స్ కోసం బలవంతం.. ప్రజ్వల్ రేవణ్ణ దుర్మార్గం..
- ప్రజ్వల్ రేవణ్ణపై మరో మహిళ ఫిర్యాదు..
- ఇప్పటి వరకు నలుగురు మహిళల కంప్లైట్..
- కొడుకు స్కూల్ అడ్మిషన్‌కి వెళ్తే వర్చువల్ సెక్స్ కోసం బలవంతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prajwal Revanna: సెక్స్ వీడియోల కుంభకోణంలో మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అరెస్టయ్యారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. పలువురు మహిళలపై అత్యాచారం, లైంగిన వేధింపులకు పాల్పడిన వందల వీడియోలు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ఈ కేసు బయటకు రాగానే ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీ పారిపోయి, ఇటీవల బెంగళూర్ తిరిగి వచ్చాడు. ఎయిర్‌పోర్టులోనే పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. రేవణ్ణ ఇంట్లో పనిచేస్తున్న మహిళ ప్రజ్వల్ రేవణ్ణతో పాటు అతని తండ్రి హెచ్‌డీ రేవణ్ణలపై అత్యాచారం ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ కేసును సిట్ విచారిస్తోంది. ప్రజ్వల్ సిట్ కస్టడీలో ఉన్నాడు.
Read Also: Jammu Kashmir: దోడాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం..
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ఇదిలా ఉంటే, మరో మహిళ ప్రజ్వల్ రేవణ్ణపై సంచలన ఆరోపణలు చేశారు. తన కొడుకు అడ్మిషన్ కోసం వెళ్లిన గృహిణిని ప్రజ్వల్ రేవణ్ణ లైంగికం వేధించినట్లు ఫిర్యాదు చేసింది. దీంతో ప్రజ్వల్‌పై ఇప్పటి వరకు నలుగురు మహిళలు ఫిర్యాదు చేశారు. తన కుమారుడిని స్కూల్‌లో చేర్పించేందుకు సాయం చేయాలని, అప్పటి జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్‌ని కోరినట్లు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. అయితే, తనతో వర్చువల్ సెక్స్ చేయాలని బలవంతం చేసినట్లు వెల్లడించింది. అక్టోబర్ 2019-2020 మధ్య హసన్‌లో ఉన్న సమయంలో దాదాపుగా 8-10 సార్లు ఈ బలవంతపు చర్యకు పాల్పడినట్లు చెప్పింది. తన కుమారుడి అడ్మిషన్ లేవనెత్తినప్పుడల్లా, తనతో శృంగారంలో పాల్గొనేదాకా పని జరగదని చెప్పాడని ఆమె వెల్లడించింది.
మొదటి రెండు సంఘటనల తర్వాత వీడియో రికార్డింగ్ చేసినట్లు తనను బ్లాక్‌మెయిల్ చేసినట్లు మహిళ చెప్పింది. ఈ కాల్స్ అన్నీ రాత్రి సమయంలో జరిగాయని చెప్పారు. మహిళ ఫిర్యాదుతో లైంగిక వేధింపులు, నేరపూరిత బెదిరింపు, మహిళల గౌరవాన్ని కించపరచడం, గోప్యతను ఉల్లంఘించిన సెక్షన్ కింద కేసు నమోదైంది. ప్రజ్వల్ రేవణ్ణ రికార్డు చేసిన 2920 వీడియో క్లిప్‌లలో బాధిత మహిళ వీడియో కూడా ఉంది.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!