వక్ఫ్ బిల్లుపై మంగళవారం జరిగిన సంయుక్త పార్లమెంటరీ సమావేశంలో మరోసారి దుమారం చెలరేగింది. సమావేశంలో బీజేపీ, టీఎంసీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సమావేశంలో టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై బాటిల్ విసిరినట్లు సమాచారం. ఈ క్రమంలో అతని చేతికి గాయమైంది. సమావేశం అనంతరం గది నుంచి బయటకు వస్తుండగా కళ్యాణ్ బెనర్జీ బొటన వేలికి గాయమైంది. నివేదిక ప్రకారం, బీజేపీ ఎంపీ అభిజీత్ గంగోపాధ్యాయతో వాగ్వాదం జరిగింది. దీనికి ముందు కూడా జేపీసీ…
తిరుమలలో ఓ భారీ పాము హల్చల్ చేసింది. దాదాపు 7 అడుగులుండే ఓ జెర్రిపోతు భక్తులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. వెంటనే పాము సంచరిస్తుందని టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో.. పాములు పట్టే స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు ఘటనా స్థలానికి చేరుకుని భారీ సైజుతో ఉన్న పామును పట్టుకున్నారు. స్థానికులు తిరిగే డీ టైప్ క్వార్టర్స్ వద్ద ఈ పామును గుర్తించారు. తరువాత దూరంలో అటవీ ప్రాంతంలో జెర్రిపోతు పామును వదిలేశారు.
Haryana : రెండు రోజుల క్రితం హర్యానాలోని జింద్‌లోని సఫిడాన్ సివిల్ ఆస్పత్రికి తీసుకొచ్చిన మృతదేహం ఫ్రీజర్ చెడిపోవడంతో కుళ్లిపోయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బయటకు తీసుకెళ్తుండగా అందులో పురుగులు కనిపించాయి.
నగరంలో రెండో రోజు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు అట్ట హాసంగా జరుగుతున్నారు. అయితే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భద్రతా లోపం బయటపడింది. బీజేపీ కార్యవర్గ సమావేశంలోకి తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులు రహస్యంగా వెళ్లారు. అంతేకాకుండా.. ఇంటెలిజెన్స్ సీఐ శ్రీనివాస్ లోపలికి వెళ్లి రహస్యంగా ఫొటోలు తీస్తుండగా బీజేపీ నేత ఇంద్రాసేనా రెడ్డి అడ్డుకున్నారు. ఎందుకు ఫోటోలు తీస్తున్నారని ప్రశ్నించి వారిని బయటకు పంపారు. సమావేశం అజెండా.. తీర్మానం కాపీల ఫొటోలను తీసేందుకు ప్రయత్నించినట్లు బీజేపీ…