సాధారణంగా ఇళ్లలో పెంపుడు జంతువుల్ని ఎక్కువమంది పెంచుకుంటారు. తమ సొంత పిల్లల్లా వాటిని ప్రాణ సమానంగా చూసుకుంటారు. అలా పెంపుడు జంతువులపై ప్రేమ కురిపిస్తారు. ఒక వేళ వాటికి ఏమైన జరిగితే బిక్కుబిక్కుమంటూ తల్లడిల్లిపోతారు. అయితే, మంచిర్యాల జిల్లాలో ఓ కుటుంబం పిల్లిని పెంచుకుంటుంది. తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా ఆ పిల్లిని భావించారు. అయితే, ఉన్నట్టుండి ఆ పిల్లి కనిపించకపోవడంతో ఆ ఫ్యామిలీ ఎంతో బాధ పడుతుంది. ఇక దాన్ని వెతికి పెట్టి.. తమకు తెచిస్తే.. రివార్డ్ ఇస్తామంటూ ప్రకటించారు.
Read Also: Poorna: హీరోయిన్ పూర్ణ కొడుకును చూశారా..ఎంత ముద్దుగా ఉన్నాడో?
మంచిర్యాలకు చెందిన పర్వేజ్ కుటుంబసభ్యులు నాలుగేళ్లుగా ఓ పిల్లిని పెంచుకుంటున్నారు.. దాని పేరు ఫ్లుప్ఫి.. నాలుగు నెలలుగా ఈ పిల్లి కనిపించడం లేదు.. పిల్లి తప్పిపోవడంతో దాన్ని పట్టి తీసుకురావడానికి ఏకంగా వారు బహుమతిని ప్రకటించారు. తమ పిల్లిని తీసుకొచ్చిన వారికి 10 వేల రూపాయల రివార్డ్ ఇస్తామంటూ మంచిర్యాలలోని ప్రధాన కూడళ్లలో పోస్టర్లను అతికించారు.
Read Also: Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
పెంపుడు జంతువులు కనిపించకపోతే చాలామంది బెంగపెట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. కొందరైతే పెంపుడు జంతువుల పుట్టినరోజుల్ని కూడా కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ఘనంగా జరుపుకుంటున్నారు. మరికొందరు ప్రేమగా పెంచుకున్న జంతువులు చనిపోతే వాటికి విగ్రహాలు పెట్టించిన ఘటనల్ని కూడా చూశాం.. ఇప్పుడు ఈ పిల్లి కోసం ఆ కుటుంబం ఏకంగా రివార్డ్ ప్రకటించడంతో పాటు నగరంలోని వాల్ పోస్టర్లను అంటించడంతో ఈ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక, దీనిపై నెటిజన్స్ విభిన్నంగా స్పందిస్తున్నారు.