హీరోయిన్ పూర్ణ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. నటిగా ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి పూర్ణ అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డారు.. బాలయ్య నటించిన అఖండ సినిమాలో కీలక పాత్రలో కనిపించింది.. ఇక బుల్లితెరపై కూడా పలు కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరిస్తుంది.. ఈమెకు హీరోయిన్ గా సినిమా అవకాశాలు రాకపోవడంతో పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను సెకండ్ హీరోయిన్ గాను నటిస్తూ వెండితెరపై సందడి చేస్తుంది..
పూర్ణ గత ఏడాది వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే.. దుబాయ్ కి చెందిన ఒక వ్యాపార వేత్తను గత ఏడాది జూన్ లో దుబాయిలో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు.ఇలా వివాహం తర్వాత కూడా ఈమె బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేశారు.అలాగే వెండితెర సినిమాలలో కూడా సందడి చేశారు. అయితే పెళ్లయిన కొద్ది నెలలకే గర్భం దాల్చడంతో పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.ఇలా ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి పూర్ణ ఎప్పటికప్పుడు తన ప్రేగ్నెన్సీ విశేషాలను అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంది..
ఇటీవలే ఒక బాబుకు జన్మనిచ్చింది.. అయితే బాబును ఎక్కడ చూపించలేదు.. తాజాగా ఓ ఈవెంట్ కు హాజరైన పూర్ణ తన కొడుకు ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఓ పెళ్లి వేడుకకు పూర్ణ భర్త షానిద్ అసిఫ్ అలీ, కొడుకుతో పాటు హాజరైంది. ఈ పెళ్లి వేడుకలో దిగిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. పూర్ణ చేతుల్లో ఉన్న కొడుకు చందమామలా అందంగా ఉన్నాడు. ఫ్యాన్స్ పూర్ణ కొడుకు చాలా అందంగా ఉన్నాడని కొనియాడుతున్నారు.. ప్రస్తుతం అవి ట్రెండ్ అవుతున్నాయి.. ఇక కేరీర్ విషయానికొస్తే.. తాజాగా మొదలైన ఢీ లేటెస్ట్ సీజన్ జడ్జిగా ఆమె వ్యవహరిస్తున్నారు. బుల్లితెరపై, సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేస్తున్నారు. దసరా మూవీలో పూర్ణ చిన్న రోల్ చేశారు. నాని హీరోగా తెరకెక్కిన దసరా బ్లాక్ బస్టర్ కొట్టింది.. ఇక పలు సినిమాలకు సైన్ చేసిందని తెలుస్తుంది..