ప్రేమ ఎప్పుడు, ఎక్కడ, ఎలా పుడుతుందో తెలియదు.. ఒక్కసారి ప్రేమలో పడితే.. చనిపోవడానికైనా సిద్ధపడిపోతారు ప్రేమికులు. అంతలా ప్రేమ మైకంలో మునిగిపోతారు. తమ ప్రేమ కోసం ఎంతటి వారినైనా వారు ఎదిరిస్తారు. అయితే, ఓ ప్రేమ జంట జైల్లో ప్రేమించుకుని పెరోల్ మీద బయటకు వచ్చి పెళ్లి చేసుకున్నారు.. అదేనండి.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని తూర్పు బర్ధమాన్ జిల్లాలోని జైలులో జరిగింది. వేరు వేరు హత్యా నేరాల్లో దోషులుగా శిక్షపడి జైలుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు ప్రేమలో పడ్డారు.
Read Also: Daggubati Purandeswari: సోషల్ మీడియా మాధ్యమం ద్వారా విస్తృత ప్రచారం చేయాలి.. పురందేశ్వరి పిలుపు
ఇద్దరు నేరస్తులు హత్యా నేరంలో దోషులుగా తేలి బర్ధమాన్ సెంట్రల్ జైలులో ఖైదు చేయబడ్డారు. అయితే.. అక్కడే ఇద్దరు మొదటి సారి కులుసుకున్నారు.. అనంతరం చిగురించి స్నేహం.. కాస్త ప్రేమగా మారింది. వారి సంబంధం గురించి వారి కుటుంబ సభ్యులకు చెప్పి పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. వివాహ వేడుక కోసం ఈ జంట ఐదు రోజులు పెరోల్‌పై రిలీజ్ అయ్యారు. అనంతరం తూర్పు బర్ధమాన్‌లోని మాంటేశ్వర్ బ్లాక్‌లోని కుసుమ్‌గ్రామ్‌లో ముస్లిం చట్టం ప్రకారం పెళ్లి చేసుకున్నారు.
Read Also: Viral Video: పాకిస్తాన్ చంద్రయాన్.. చూసి నవ్వుకుంటున్న జనాలు..!
వధువు పేరు సహనారా ఖాటున్, వరుడి పేరు అబ్దుల్ హసీమ్. కాగా, ఈ విషయంపై అబ్దుల్ మాట్లాడుతూ తామిద్దరం బర్ధమాన్ సెంట్రల్ జైల్లో నిర్బంధించబడ్డాము. అదే రోజు మా సహచర ఖైదీలు మమ్మల్ని కలవడానికి వచ్చారు.. మేము అక్కడ నుంచి ఒకరినొకరు చూసుకున్నామని తెలిపాడు. కొద్ది కొద్దిగా మా మధ్య మాటలు పెరిగి.. అది పెళ్లి వరకు వెళ్లిందని అబ్దుల్ చెప్పాడు. మా జీవితంలోని చీకటి నుంచి బయటపడి, మా జీవితాలను చక్కగా గడపాలని కోరుకుంటున్నామని అతడు చెప్పాడు.
Read Also: Sai Pallavi: అమర్నాథ్ ఆలయాన్ని సందర్శించిన సాయి పల్లవి..
సహనారా మాట్లాడుతూ.. మేం జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత.. ఈ జీవితాన్ని మళ్లీ కొత్తగా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నట్లు తెలిపింది. అందరిలాగే తాము జీవించాలని ఉంది అని ఆమె చెప్పుకొచ్చింది. అయితే, బీర్భూమ్ నివాసి ఖాటున్ గత ఆరేళ్లుగా జైలులో ఉండగా, అస్సాంకు చెందిన అబ్దుల్ హసీమ్ ఎనిమిదేళ్లుగా జైలు జీవితం అనుభవిస్తున్నాడు. బర్ధమాన్ సెంట్రల్ జైల్లో వివాహం జరగడం ఇదే మొదటిసారి. పెళ్లి చేసుకున్న అనంతరం ఇద్దరూ మళ్లీ జైలుకు వచ్చారు.