Daggubati Purandeswari: సోషల్ మీడియా మాధ్యమం ద్వారా విస్తృత ప్రచారం చేయాలి.. పురందేశ్వరి పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Daggubati Purandeswari Meeting With AP BJP Social Media Wing: బూత్ స్థాయి నుంచి వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసి.. కేంద్ర ప్రభుత్వ పథకాలను సోషల్ మీడియా మాధ్యమం ద్వారా విస్తృత ప్రచారం చేయాలని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపునిచ్చారు. విజయవాడలో బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ కేశవ్ కాంత్ అధ్యక్షతన రాష్ట్ర సోషల్ మీడియా ప్రతినిధులతో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. భారతమాత ఫొటోకి పూలమాల వేసి, ఈ సమావేశాన్ని పురంధేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచారం ద్వారా ఈ రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం చేస్తున్నారనే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న దుష్టప్రచారాన్ని తిప్పి కొట్టాలని అన్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు పథకాల్ని వివరించి.. వచ్చే ఎన్నికలకు సమాయత్తం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. కాగా.. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సోషల్ మీడియా ఇంఛార్జి విష్ణువర్ధన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్య నారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. కేశవ్ కాంత్ బీజేపీ సోషల్ మీడియా చేస్తున్న కార్యక్రమాలను ఎల్ఈడీ స్క్రీన్‌పై ప్లే చేసి చూపించారు.
Sai Pallavi: అమర్నాథ్ ఆలయాన్ని సందర్శించిన సాయి పల్లవి..
Also Read
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
- Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
- Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
- Ambati Rambabu: స్థానిక ఎన్నికల వేళ సర్టిఫికెట్ల వివాదం.. అంబటి సంచలన ఆరోపణలు..
అటు.. రేపు కూడా ఏపీ బీజేపీ ఆఫీస్ బేరర్ల సమావేశాన్ని నిర్వహించనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి పురదేంశ్వరి ఆఫీస్ బేరర్ల సమావేశానికి హాజరు కానున్నారు. కమిటీల బలోపేతం.. కమిటీల్లో మార్పులు చేర్పులపై ఈ సమావేశంలో చర్చే జరిగే అవకాశం ఉంది. పార్టీ కోసం కష్టపడి పని చేసే వారికే కమిటీ బాధ్యతలు అప్పగించాలంటూ ఇప్పటికే పురందేశ్వరి స్పష్టం చేశారు. ఇదే సమయంలో.. పార్టీ అనుబంధ విభాగాలతోనూ ఆమె భేటీలు నిర్వహిస్తున్నారు. బీజేపీ హైకమాండ్ తనకు రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు ఇవ్వడంతో.. పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయడం కోసం కసరత్తులు మొదలుపెట్టారు.
Heavy rains: దేశవ్యాప్తంగా మరో నాలుగైదు రోజుల పాటు భారీగా వర్షాలు..
తాజావార్తలు
-
Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!
-
Hanuman Sentiment: గురూజీకి కలిసొరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
-
Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
-
INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
-
Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!