విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు., ప్రయాణీకులు కొన్ని మర్యాదలను పాటించాలి. అలాగే వారి చుట్టూ కూర్చున్న వారికి ఇబ్బంది కలిగించకుండా మెలగాలి. ఇకపోతే ఒక విమాన ప్రయాణీకుడు ఇటీవల విమానంలో తన ఇద్దరు తోటి ప్రయాణికులు నమ్మశక్యం కాని రీతిలో సన్నిహితంగా మెలగడం చూసి తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలలో వారు చెప్పులు లేకుండా సీట్ల వరుసలో పడుకుని ఒకర్ని ఒకరు హత్తుకొని పడుకున్నారు.
Also read: Virat Kohli: టీమిండియాలో సీత, గీత ఎవరో తెలుసా..! కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఫ్లీ అనే ఓ సోషల్ మీడియా యూజర్.. ఇటీవల జరిగిన విమాన అనుభవాన్ని గురించి చెప్పాడు. విమయినలో ఉన్న ఆ జంటకు సంబంధించిన ఫోటోలను అతను షేర్ చేసాడు. ఇకపోతే ఒకరితో ఒకరు సన్నిహితంగా ఉన్న జంటను చూసి కాస్త భయాందోళనకు గురయ్యాడు. ఇకపోతే ఈ చిత్రాలు వీక్షకులకు కాస్త ఇబ్బందిగా కూడా ఉన్నాయి. ఇక అందులోని ప్రయాణీకుల ప్రకారం., విమానం ప్రయాణం మొత్తంలో గుర్తుతెలియని ఓ జంట కౌగిలించుకొని ఉన్నారని.. “విమానంలో నేను చూసినది నమ్మలేకపోతున్నాను, ఇది మొత్తం 4 గంటల విమానంలో ఇలాగే ఉంది” అంటూ తెలిపారు.
ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా చాలా మంది సోషల్ మీడియా నెటిజన్స్ అనేక కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ పోస్ట్ ప్రతిస్పందనగా జోకులు, మీమ్ లను పంచుకున్నారు. అయితే కొందరు, ఈ జంట ప్రవర్తన సరికాదని., అంటుండగా.. మరికొంతమంది ”ఫ్లైట్ అటెండెంట్స్ ఏం చేస్తున్నారు మీరు.. మీరైనా చెప్పేది లేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరిక యూజర్ అయితే.. ” ఇది చాలా అందంగా ఉంది., కాకపోతే ఫ్లైట్ గాలిలో ఎగురుతున్నప్పుడు నేను చాలా ఆత్రుతగా ఉన్నాను, నాకు అన్ని సమయాలలో నా సీట్‌బెల్ట్ అవసరం.” అంటూ కామెంట్స్ చేసారు.
Can't believe my view on the plane
It was like this the whole 4 hour flight. 😆😆 pic.twitter.com/ruz39rLzDm— FLEA 🇭🇹 (@babyibeenajoint) April 5, 2024