నేడు రంజాన్ పర్వదినం కారణంగా ముస్లింల పవిత్రమైన రంజాన్ మాసం నేటితో ముగుస్తుంది. ఇకపోతే రంజాన్ మాసం నేపథ్యంలో ముస్లిం సోదరులతో పాటు మిగితావారు కూడా.. ముఖ్యంగా హైదరాబాదులో ఎలా తిన్నారేమో తెలియదు కానీ.. రంజాన్ నెలలో బిర్యానీలు హలీంలు తెగ లాగించేశారు. ఇక ఇందుకు సంబంధించి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలలో ఒకటైన స్విగ్గి తాజాగా కొన్ని రిపోర్ట్స్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగానే..
Also Read: Kartikeya 8: హ్యాపీడేస్ టైసన్‌తో కార్తికేయ సినిమా.. భలే సైలెంటుగా పూర్తి చేశారే?
ఒక హైదరాబాద్ మహానగరంలోని కేవలం రంజాన్ మాసంలో దాదాపు 60 లక్షలకు పైగా బిర్యాని ఆర్డర్స్ డెలివరీ అయినట్లు తెలిపింది. అలాగే ఐదు లక్షల అరవై వేల హలీంలను కూడా డెలివరీ చేసినట్లు స్విగ్గి తెలిపింది. మామూలు నెలలతో పోలిస్తే ఇది దాదాపు 15 శాతం ఎక్కువ. ఇకపోతే ఈ లెక్కలు కేవలం స్విగ్గి కి మాత్రమే సంబంధించినవి. ఇక మిగతా యాప్స్ సంగతి వివరాలు చూస్తే.. మనకి గుండె ఆగిపోతుందేమో. కేవలం ఆన్లైన్ ఆర్డర్లు మాత్రమే కాకుండా నేరుగా వెళ్లి తిన్న వారి సంగతి లెక్కవేస్తే ఇక అంచనాలకు మించి లెక్కలు వేయాల్సి ఉంటుంది.
Also Read: Kissing Controversy: “ఇది ఆప్యాయత, దీంట్లో తప్పేముంది”.. బీజేపీ నేత ముద్దుపై యువతి వ్యాఖ్యలు..
ఇక నేడు రంజాన్ పండుగను పునస్కరించుకొని స్విగ్గి యాప్ లో ఫుడ్ ఆర్డర్లు బాగా పెరిగాయి. ముఖ్యంగా ఈసారి హలీంను హైదరాబాదులో తెగ ఆరగించేశారు. చికెన్ బిర్యాని, హలీం, సమోసాలు లాంటి సాంప్రదాయ వంటకాలకు రంజాన్ మాసంలో అత్యంత ప్రజాదరణ పొందిన వంటకాలుగా ఉన్నట్లు స్విగ్గి తెలిపింది. ఇందులో భాగంగా సాయంత్రం పూట నమాజ్ సమయంలో ఐదున్నర గంటల సమయం నుండి 7 గంటల వరకు ఇఫ్తార్ లో భాగంగా ఏకంగా 34% ఆర్డర్లు పెరిగాయని స్విగ్గి తెలిపింది. ఇందులో ముఖ్యంగా చికెన్ బిర్యాని, మటన్ బిర్యానీ , హలీం, సమోసా, ఫలుదా, కీర్ లు వరుసగా ఉన్నట్లు స్విగ్గి తెలిపింది. ఇక జాతీయ స్థాయిలో చూస్తే హలీం డెలివరీలు ఏకంగా 1454 శాతం పెరిగినట్లు తెలిపింది. ఉపవాసం విరమణ సమయంలో ముస్లిం సోదరులు ఇఫ్తార్ విందులో వీరిని ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడతారు. వీటితోపాటు ఖర్జూర పండ్లు అలాగే భాజీయ పదార్థాలు కూడా ఈ లిస్టులో ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా భాజీయ విషయానికి వస్తే ఏదైనా 77% పెరుగుదల కనబడిందని స్విగ్గి తెలిపింది. ఇక ఈ లెక్కలన్నీ మార్చి 12 నుండి ఏప్రిల్ 10 వరకు చెందినవి మాత్రమే.