ఒకప్పుడు విద్యలేని వాడు వింత పశువు అన్నారు. నేటి విద్యావంతులు.. పశువులు కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు. మరీ వీళ్లను ఏమనాలో..! విద్య సంస్కారం, క్రమశిక్షణ నేర్పిస్తుంది. పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన వాళ్లే.. అదే జనంతో ఛీ అనిపించుకునే పరిస్థితులు తెచ్చుకుంటున్నారు. ఇందుకు తాజాగా చోటుచేసుకున్న సంఘటనలే ఉదాహరణ.

రాజస్థాన్‌లో ఓ జంట నడిరోడ్డుపై బైక్‌పై వెళ్తూ హద్దులు దాటి ప్రవర్తించారు. ప్రేమికులిద్దరూ రొమాన్స్‌లో మునిగిపోయారు. తాజాగా భాగ్యనగరం హైదరాబాద్‌లోని కూడా ఓ జంట పట్టపగలు నడిరోడ్డుపై రెచ్చిపోయారు. శుక్రవారం వేకువజామున బీరు తాగుతూ నానా హంగామా సృష్టించారు. నాగోల్‌లో ఓ వైపు మార్నింగ్ వాకర్స్ తమ పనుల్లో నిమగ్నమై ఉంటే.. ఇంకోవైపు ప్రేమికులిద్దరూ బీరు సీసాలు చేతిలో పెట్టుకుని.. కారులో భీకరమైన లౌడ్ స్పీకర్లు ఆన్ చేసి.. నడిరోడ్డుపై తాగుతూ అభ్యంతరకరంగా ప్రవర్తించారు. వారి చేష్టలను కొంతసేపు భరించిన వాకర్స్.. మరింత శృతిమించడంతో ప్రజలు కలుగజేసుకుని ఇది పద్ధతి కాదని చెప్పిన పాపానికి జంట మరింత రెచ్చిపోయింది. వాకర్స్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించారు. అమ్మాయైతే.. బీరు సీసా చేతిలో పట్టుకుని దాడి చేసేందుకు ప్రయత్నిస్తూ బండ బూతులు తిట్టింది. అక్కడే ఉన్న వాకర్స్.. ఈ దృశ్యాలు మొబైల్లో చిత్రీకరించి.. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. పలువురు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇదేం మాయరోగం అంటూ జంటపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదేం పెంపకం అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇలా నెటిజన్లు జంటపై మండిపడుతున్నారు.
రాజస్థాన్‌లో నడిరోడ్డుపై రెచ్చిపోయిన ప్రేమ జంటకు తగిన శాస్తి జరిగింది. పోలీసులు స్టేషన్‌కు తరలించి.. గుంజీలు తీయించారు. ఇద్దరి చేత ప్రమాణాలు కూడా చేయించారు. మరోసారి ఇలా చేయమంటూ వారిద్దరి చేత ప్రమాణపత్రం కూడా తీసుకున్నారు. హైదరాబాద్ జంటకు కూడా పోలీసులు కౌన్సెలింగ్ ఇవ్వాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి.