Businessman Suicide After ED Notice: జార్ఖండ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులకు భయపడి ఒక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. రాంచీలో ఓ భూ వ్యాపారి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. భూ కుంభకోణంలో ఈడీ నుంచి నోటీసు అందడంతో తీవ్ర ఒత్తిడికి లోనై సూసైడ్ చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నేటి (గురువారం) ఉదయం అతని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Read Also: Amit Shah: ఈ ఎన్నికలు జిహాద్ కు, అభివృద్ధికి మధ్య జరుగుతుంది.. అమిత్ షా హాట్ కామెంట్స్..
కాగా, ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలోని లాల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సిల్వర్ డెల్ అపార్ట్‌మెంట్‌లో చోటు చేసుకుంది. కృష్ణకాంత్ అనే భూ వ్యాపారి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు హడావుడిగా అతడ్ని ఆర్కిడ్ ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: crime news: భర్తతో విభేదాల కారణంగా తన మూడేళ్ల కుమారుడికి కాల్చి చంపిన తల్లి
ఇక, భూ కుంభకోణం కేసుకు సంబంధించి కృష్ణకాంత్‌కు కొద్ది రోజుల క్రితమే ఈడీ నోటీసులు పంపింది అని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అతన్ని విచారణకు పిలిచినప్పటి నుంచే అతడు తీవ్ర ఒత్తిడికి గురైనట్లు పేర్కొన్నారు. అయితే, ఆత్మహత్యకు ఈడీ నోటీసులు మాత్రమే కారణమా లేదా అనేది ఇంకా ధృవీకరించబడలేదు. పోలీసులు అన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.