Amit Shah: ఈ ఎన్నికలు జిహాద్ కు, అభివృద్ధికి మధ్య జరుగుతోందని భువనగిరి జన సభలో అమిత్ షా హాట్ కామెంట్స్ చేశారు. జై శ్రీరామ్ నినాదంతో అమిత్ షా ప్రసంగం ప్రారంభించారు. ఈ ఎన్నిక రాహుల్, మోదీకి మధ్య జరుగుతుంది.. ఎన్నిక జిహాద్, అభివృద్ధికి మధ్య జరుగుతున్నాయన్నారు. కుటుంబ పాలనకు, భారతీయ కుటుంబానికి మధ్య పోటీ జరుగుతుందన్నారు. మూడు విడతల పోలింగ్ తర్వాత 200 స్థానాలు బీజేపీ గెలుస్తుందన్నారు. తెలంగాణలో 10 కంటే ఎక్కువ లోక్సభ స్థానాలు గెలుస్తామన్నారు. 400 సీట్లు ఇవ్వడానికి మార్గాన్ని సుగమం చేస్తుందని తెలిపారు. భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీకి సన్నిహితుడన్నారు. రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసిన వ్యక్తికే కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నాడని, మోడీ 10 ఏళ్లుగా పూర్తి మెజారిటీతో అధికారంలో ఉన్నా రిజర్వేషన్లు తొలగించలేదన్నారు.
Read also: crime news: భర్తతో విభేదాల కారణంగా తన మూడేళ్ల కుమారుడికి కాల్చి చంపిన తల్లి
తెలంగాణలో 10 కంటే ఎక్కవ సీట్లు బీజేపీ కి వస్తే ముస్లిం రిజర్వేషన్లు తొలగించి.. ఆ రిజర్వేషన్లను ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇస్తామన్నారు. మోడీ చెప్పిందే.. చేస్తాడు… అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. రామ మందిర నిర్మాణ వాగ్దానం నెరవేర్చిన మోడీది అని తెలిపారు. 370 ఆర్టికల్ రద్దుచేసి కాశ్మీర్ మనదేనని దేశానికి చెప్పాయన్నారు. దేశంలో తీవ్రవాదం, మావోయిజన్ని దూరం చేసి, దేశాన్ని సురక్షితం చేశాయన్నారు. టెక్స్ టైల్ రంగాన్ని అభివృద్ధి చేసి.. పెద్ద ఎత్తున ఉపాధి కల్పించిన ఘనత మోడీ ది అని తెలిపారు. ఎయిమ్స్ ఏర్పాటు చేసి ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాకు మెరుగైన వైద్య సేవలు అందించామన్నారు.
Read also: Poppy Seeds Benefits : గసగసాలు రోజూ తీసుకుంటే మహిళలకు ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
అసదుద్దీన్, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే అని కీలక వ్యాఖ్యలు చేశారు. షరియత్, ఖురాన్, ఆధారంగా తెలంగాణను నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రిపుల్ తలాక్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్నారు. పదేళ్లు అధికారంలో ఉంటే.. కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఏటీఎం మార్చుకుందన్నారు. 10 కంటే ఎక్కువ స్థానాల్లో గెలిపిస్తే తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ గా చేస్తాం జైశ్రీరామ్ నినాదంతో ప్రసంగాన్ని అమిత్ షా ముగించారు. మరి కాసేపట్లో తిరుగు ప్రయాణం కానున్నారు.
KCR: కేసీఆర్ బస్సు యాత్రలో చేతివాటం.. డిప్యూటీ మేయర్ బంగారం, కౌన్సిలర్ డబ్బు చోరీ..