తెలుగు చిత్ర పరిశ్రమలో అనుష్క శెట్టి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు. ఈ భామ నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమా తో టాలీవుడ్ కి పరిచయం అయింది.ఆ తరువాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో చేసిన అరుంధతి వంటి లేడీ ఓరియెంటెడ్ మూవీతో అనుష్క బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ సినిమాతో అనుష్క స్టార్ హీరోయిన్ అయిపొయింది.తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.ఈ మూవీ భారీ విజయాన్ని సాధించడంతో అనుష్కకు వరుస అవకాశాలు వచ్చాయి.మహేష్ , ప్రభాస్ వంటి స్టార్ హీరోస్ సరసన నటించి మెప్పించింది.. అయితే ఈ భామ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో బాగా పాపులర్ అయింది.ఈ చిత్రంలో దేవసేన పాత్రలో అద్భుతంగా మెప్పించిన అనుష్క.. ఆ తర్వాత మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది. చివరిగా ఈ భామ నిశ్శబ్దం సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. దీనితో కొన్నాళ్ళు ఈ భామ సినిమాలకు దూరం అయింది.
చాలా గ్యాప్ తర్వాత అనుష్క నటిస్తోన్న చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. డైరెక్టర్ మహేష్ బాబు రూపొందిస్తోన్న ఈ సినిమాలో జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్నారు. లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ చిత్రం మరో రెండు రోజుల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ఎంతో కొత్తగా నిర్వహిస్తుంది చిత్రయూనిట్.ఈ సినిమా ప్రమోషన్స్ ను హీరో నవీన్ పొలిశెట్టి మాత్రమే గత కొద్దీ రోజులుగా చేస్తున్నారు. ఇప్పుడు అనుష్క కూడా ఇందులో భాగమయ్యింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె సినిమా విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా తెలిపింది.. ఈ నేపథ్యంలోనే తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది ఈ భామ.. తాను పెళ్లికి వ్యతిరేకం కాదని.. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెప్పింది.ఈ సినిమా లో తన పాత్ర పేరు అన్విత అని తెలిపింది.అనుకున్న పని పూర్తి చేయడం కోసం దేనికైనా సిద్ధపడే మనస్తత్వం గల అమ్మాయి అని తెలిపింది. ఇప్పటివరకు తాను పోషించిన ప్రత్యేకమైన పాత్రలలో కంటే అన్విత పాత్ర కాస్త భిన్నంగా ఉంటుందని ఆమె తెలిపింది. ఇలాంటి పాత్రలు చేయడం నా అదృష్టం ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుంది అని ఆమె తెలిపింది