Prabhas: ప్రభాస్ కి ఇష్టమైన రొయ్యల పలావ్ రెసిపీ ఇదే.. ఇక చరణ్ వంతు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rebel star Prabhas kickstarts MSMP recipe challenge:‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి‘ ప్రమోషన్స్ లో ఇప్పటి వరకు సైలెంటుగా ఉన్న హీరోయిన్ అనుష్క శెట్టి ఇప్పుడు మాత్రం ఒక యూనిక్ కాన్సెప్ట్ తో ముందుకొచ్చింది. ఈ సినిమాలో చెఫ్ అన్విత రవళి శెట్టి క్యారెక్టర్ లో నటించిన అనుష్క సినిమాను ప్రమోట్ చేసేందుకు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రెసిపీ ఛాలెంజ్ ప్రారంభించింది. ఈ సందర్భంగా తనకు ఇష్టమైన వంటలైన మంగళూరు చికెన్ కర్రీ, మంగళూరు స్పెషల్ నీర్ దోస రెసిపీలను ఎలా తయారు చేయాలో తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పోస్ట్ చేసింది. ఆ తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రెసిపీ ఛాలెంజ్ ను మొదటగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు విసిరింది. ప్రభాస్ ఎంత ఫుడ్ లవర్ అనేది అందరికీ తెలుసు, ఆయన ఇష్టంగా తినడమే కాదు..తన కో స్టార్స్ కు, స్నేహితులకు మంచి మంచి వంటలు రుచి చూపిస్తుంటారు, అందుకే ఫస్ట్ ప్రభాస్ కు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రెసిపీ ఛాలెంజ్ విసిరినట్లు అనుష్క తెలిపింది.
Pa. Ranjith: సనాతన ధర్మంపై ఉదయనిధి మాటల్లో తప్పేం లేదు.. పా.రంజిత్ సంచలన ట్వీట్
Also Read
ఇక అనుష్క విసిరిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రెసిపీ ఛాలెంజ్ తీసుకున్న ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా తనకు ఎంతో ఇష్టమైన రొయ్యల పలావ్ లా తయారు చేయాలో వివరించారు. ఎంతోకాలంగా అనుష్క తో తనకు పరిచయం ఉన్నా, ఆమె ఫేవరేట్ డిష్ తనకు తెలియదని, ఇప్పుడు తెలిసింది అని ప్రభాస్ తన పోస్ట్ లో పేర్కొన్నారు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రెసిపీ ఛాలెంజ్ ను రామ్ చరణ్ కు ఫార్వర్డ్ చేశాడు ప్రభాస్. ప్రభాస్, అనుష్క బిల్లా, మిర్చి, బాహుబలి1, బాహుబలి 2 చిత్రాల్లో కలిసి నటించి ఆడియెన్స్ ఫేవరేట్ జోడీ కావడమే కాకుండా మంచి స్నేహితులు కూడా అయ్యారు. ఇక ఈ స్నేహంతో అలాగే తన సొంత వారు అయిన యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా నిర్మితం కావడంతో అనుష్క హీరోయిన్ గా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ప్రమోషన్ కు సపోర్ట్ చేస్తున్నారు ప్రభాస్. ఇక ప్రభాస్ తో పాటు ప్రేక్షకులను కూడా అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రెసిపీ ఛాలెంజ్ తీసుకోవాలని కోరింది. వాళ్లు తమకు నచ్చిన రెసిపీని, వాటిని తయారుచేసే పద్ధతిని పోస్ట్ చేయాలని ఆమె కోరింది.
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!