Blast In Delhi: ఢిల్లీలోని ప్రశాంత్ విహార్‌లోని సీఆర్‌పీఎఫ్ స్కూల్ బౌండరీ వాల్ దగ్గర భారీ పేలుడు శబ్దం వినిపించింది. పేలుడు శబ్ధంతో ఆ ప్రాంతంలో భయాందోళన నెలకొంది. పేలుడు జరిగిన వెంటనే పెద్ద ఎత్తున పొగలు కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక శాఖ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పేలుడుకు గల కారణాలను తెలుసుకోవడానికి పోలీసులు ఎఫ్‌ఎస్‌ఎల్ బృందాన్ని కూడా సంఘటనా స్థలానికి పిలిపించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు ఇంకా సమాచారం లేదు.
Chandra Arya: కెనడాలోని హిందువులు తమ భద్రత కోసం భయపడుతున్నారు: కెనడా ఎంపీ చంద్ర ఆర్య
పేలుడుకు అసలు కారణాలను తెలుసుకునేందుకు నిపుణులను పిలిపించామని రోహిణి డీసీపీ అమిత్ గోయల్ తెలిపారు. ప్రస్తుతం ఇది ఏ రకమైన పేలుడు, దాని మూలం ఏమిటో స్పష్టంగా తెలియలేదు. ఘటనపై నిపుణుల బృందం సమగ్ర విచారణ చేస్తోందని, త్వరలోనే పరిస్థితి తేలనుందని డీసీపీ తెలిపారు. పేలుడు శబ్ధం పెద్దగా వినిపించడంతో సమీపంలోని వాహనాల అద్దాలు కూడా పగిలిపోయాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. సిఆర్‌పిఎఫ్ పాఠశాల గోడ చుట్టూ కొన్ని దుకాణాలు ఉన్నాయి. అయితే అక్కడి వారు సిలిండర్ పేలుడు సంభవించే అవకాశం ఉందని భావిస్తున్నారు. కానీ, ఇంకా స్పష్టంగా ఏమీ వెల్లడి కాలేదు.
Delhi : ఢిల్లీలో రోజు రోజుకు క్షీణిస్తున్న గాలి నాణ్యత.. మరి దీపావళి నాటి ఎలా ఉంటుందంటే ?
#WATCH | Delhi: A blast was heard outside CRPF School in Rohini's Prashant Vihar area early in the morning. Police and FSL team present on the spot. pic.twitter.com/S4ytKNz4cQ
— ANI (@ANI) October 20, 2024
दिल्ली रोहिणी के प्रशांत विहार इलाके में धमाके की आवाज सुनाई दी
स्कूल की दीवार पर धमाके की आवाज सुनाई दी, धमाके के बाद धुआं का गुबार देखा जा सकता है
दिल्ली पुलिस ने FSL टीम को मौके पर बुलाया है वो जांच के बाद क्लियर करेंगे कि पूरा मामला क्या है
धमाका इतना ज़ोरदार था कि करीब 30… pic.twitter.com/wYyTdAxwiH
— Amit Pandey (@amitpandaynews) October 20, 2024