Crime News: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో వృద్ధ దంపతులను హత్య చేసి వారి ఇంటిని దోచుకున్న ఘటన వెనుక 12 ఏళ్ల బాలుడి హస్తం కూడా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో చిన్నారి సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఇబ్రహీం (60), స్క్రాప్ వ్యాపారి, అతని భార్య హజ్రా నవంబర్ 22 న వారి ఇంట్లో శవమై కనిపించారు. ప్రాథమిక దర్యాప్తులో ఇది దోపిడీ యత్నంలో జరిగిన హత్య అని తేలింది. అనంతరం పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు.
Read Also: Chalapathi Rao: ‘బిర్యాని తిన్నారు.. అలా వాలిపోయారు.. ప్రశాంతంగా కన్నుమూశారు’
వృద్ధ దంపతుల దోపిడీ, హత్య కేసులో ప్రధాన సూత్రధారి 12 ఏళ్ల బాలుడిగా రుజువైనట్లు పోలీసులు నిర్ధారించారు. దంపతులతో సన్నిహితంగా మెలిగిన బాలుడు ప్రధాన నిందితుడు. ఇబ్రహీం చేతిలో చాలా డబ్బు ఉంటుందని భావించి 12 ఏళ్ల బాలుడు తన స్నేహితులతో కలిసి దోపిడీకి ప్లాన్ చేశాడు. దోపిడీకి ముగ్గురు వ్యక్తులను తీసుకెళ్లారు. అయితే చోరీకి ప్రయత్నించిన విషయం తెలుసుకున్న ఇబ్రహీం దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. అరెస్టయిన మంజేష్, శివమ్ పెద్దలు. నాలుగో నిందితుడు సందీప్ కనిపించకుండా పోయాడు. వారి నుంచి రూ.12వేలు, మొబైల్ ఫోన్, బంగారు నెక్లెస్ స్వాధీనం చేసుకున్నట్లు ఘజియాబాద్ సీనియర్ పోలీసు అధికారి ఇరాజ్ రాజా తెలిపారు.