వారణాసిలోని పరమానందపూర్‌కు చెందిన కళావతి దేవి అనే 103 ఏళ్ల వృద్ధురాలు యువతకు ఆదర్శంగా నిలుస్తుంది. అందుకు కారణం తన ఫిట్‌నెస్. 103 ఏళ్ల వయసులో కూడా ట్రాక్‌పై పరుగెత్తుతూ ఫిట్‌గా ఉండాలనే సందేశాన్ని యువతకు తెలుపుతుంది. ఇదిలా ఉంటే.. కాశీలో జరిగిన ఎంపీ క్రీడా పోటీల్లో 100 మీటర్ల పరుగు పందెంలో ఆమే పేరును నమోదు చేసుకుని.. అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆమే ఆరోగ్యంగా ఉండటానికి గల కారణాలను వివరించింది. సమతుల్య దినచర్య, ఆహారపు అలవాట్లే ఇంత ఆరోగ్యంగా ఉండటానికి ప్రధాన కారణమని తెలిపింది.
Read Also: Team India: ఈ వరల్డ్ కప్లో ఓటమెరుగని టీమిండియా.. అన్నింటిలోనూ నెంబర్ 1
బనారస్‌లోని పర్మానంద్‌పూర్‌లో నివసిస్తున్న కళావతి దేవికి చిన్నతనంలోనే వివాహం జరిగింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె భర్త మరణించాడు. దీంతో ఆమె తన తండ్రి ఇంట్లోనే నివసించింది. అప్పటి నుండి నేటి వరకు సాదాసీదా జీవితం గడపడం, మితంగా ఆహారం తీసుకోవడం, రోజూ ఉదయం 5:00 గంటలకు నిద్రలేచి వాకింగ్ చేయడం ఆమే దినచర్యలో భాగమయ్యాయి. ఇదిలా ఉంటే.. 103 ఏటా కూడా ఆమే ఇంత ఫిట్నెస్ గా ఉండటంపై సోషల్ మీడియాలో అందరూ చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా చాలామంది నెటిజన్లు తనను ప్రశంసిస్తున్నారు. ఇంతకు ముందు కూడా చాలాసార్లు పెద్దలకు, యువతకు ఫిట్‌నెస్ మంత్రాలు ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Read Also: Salaar: సలార్ స్పెషల్ నెంబర్ కోసం ‘డర్టీ గాళ్’
వైరల్‌గా మారిన ఈ వైరల్ న్యూస్ పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. జనాలు ఆమేను ఎంతగానో కొనియాడుతున్నారు. ఒక వినియోగదారుడు ‘అద్భుతమైన ఫిట్‌నెస్’ అని రాశారు. మరో వినియోగదారుడు ‘ఈ వయస్సులో నడవడం కూడా అంత సులభం కాదు’ అని కామెంట్స్ చేస్తున్నారు.