గతకొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లోని బలభద్రపురం గ్రామం హాట్ టాపిక్ గా మారింది. పదుల సంఖ్యంలో అక్కడి ప్రజలు క్యాన్సర్ భారిన పడడంతో తీవ్రకలకలం రేగింది. అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం ఇంటింటి సర్వే చేస్తూ వైద్య సేవలను యుద్ధప్రాతిపదికన ప్రారంభించింది. తాజాగా వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కీలక విషయాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కొంత కాలంగా జరుతున్నాయన్నారు. ఇప్పటికే నాలుగు లక్షల మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష లు నిర్వహించామని తెలిపారు.
Also Read: CM Chandrababu: పీ4 పై సమీక్ష.. సంపన్నులు-పేదలను ఒకేచోటుకు చేర్చడమే లక్ష్యం
అనపర్తి ఎమ్మెల్యే బలభద్రపురం క్యాన్సర్ బాధితులకు సంబంధించి ప్రస్తావించారు. 30కి పైగా టీంలను బలభద్రపురం పంపడం జరిగిందని అన్నారు. గత మూడేళ్ళలో బలభద్రపురంలో క్యాన్సర్ కారణంగా 19 మంది మరణించారు. ఇప్పుడు 32 సస్పెక్టడ్ క్యాన్సర్ కేస్ లు ఉన్నాయి. దేశంలో 14 లక్షలకు పైగా క్యాన్సర్ కేస్ లు ఉన్నాయి.. ఏపీ లో 73 వేల క్యాన్సర్ కేస్ లు నమోదు అయ్యాయని తెలిపారు.
Also Read:Railway Ticket Discounts: వారందికీ 75% వరకు రైల్వే టికెట్ పై రాయితీ!
పది వేల జనాభా ఉన్న గ్రామంలో 16 క్యాన్సర్ కేసులు ఆవరేజ్ న ఉండాలి. కానీ బలభద్రపురంలో అసాధారణ పరిస్థితి లేదు. క్యాన్సర్ పై ఎప్పటికప్పుడు అవగాహనా కార్యక్రమాలు కల్పిస్తున్నాం. పి హెచ్ సి లో మెడికల్ ఆఫీసర్ లకు ట్రైనింగ్ ఇచ్చాము. మెడికల్ ఆఫీసర్ లు గుర్తించిన తర్వాత మళ్ళీ క్యాన్సర్ పరీక్షలు ఉంటాయి. ఆ తర్వాత తగిన చికిత్స ఉంటుంది.. ప్రాధమిక దశలో గుర్తిస్తే సరైన చికిత్స అందుతుందని తెలిపారు.