పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్టనర్‌షిప్ పీ4 పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పీ4 విధానానికి తుదిరూపు ఇచ్చారు. ఉగాది సందర్భంగా అమరావతిలో పీ4 ప్రారంభం అవుతుందని సీఎం వెల్లడించారు. సాయం అందించే చేతులకు వేదిక పీ4 అన్నారు. సంపన్నులు – పేదలను ఒకేచోటుకు చేర్చడమే దీని లక్ష్యమని తెలిపారు. ఎన్నారైలతో సహా స్వచ్ఛందంగా ఎవరైనా ముందుకురావొచ్చని కోరారు. పేదలకు అండగా నిలిచేవారు ‘మార్గదర్శి’ – లబ్ధి పొందేది ‘బంగారు కుటుంబం అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మొదటి దశలో 20 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనున్నదని తెలిపారు. 2029 కల్లా పేదరికాన్ని నిర్మూలించాలనేది ప్రభుత్వ సంకల్పమని సీఎం స్పష్టం చేశారు.