NTV Telugu Site icon

Rahul Gandhi: రాహుల్ గాంధీ సహా 7 మంది ప్రతిపక్ష ఎంపీలకు పాకిస్థాన్ నుంచి మామిడి పండ్లు?..బీజేపీ ఫైర్

Rahul Gandhi

Rahul Gandhi

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి పాకిస్థాన్ నుంచి మామిడి పండ్లను పంపిందన్న వార్తలపై భారతీయ జనతా పార్టీ మండిపడుతోంది. ఇది పాకిస్థాన్‌తో ‘నీచమైన’ సంబంధమని బీజేపీ అభివర్ణించింది. ఢిల్లీలోని పాక్ హైకమిషన్ నుంచి రాహుల్ సహా 7 మంది ఎంపీలకు మామిడి పళ్ల డబ్బాలు పంపిణీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై కాంగ్రెస్ నుంచి ఎలాంటి వ్యాఖ్య లేదు. మీడియా కథనాల ప్రకారం.. రాహుల్‌తో పాటు, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్, కేరళలోని తిరువనంతపురం నుంచి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలు ఎం నద్వీ, జియావుర్ రెహ్మాన్ బెర్గ్, ఇక్రా హసన్, ఘాజీపూర్ ఎంపీ అఫ్జల్ అన్సారీలకు మామిడి పండ్లను పంపారు. భారత్-పాక్ రెండూ శత్రు దేశాలన్న విషయం తెలిసిందే. పుల్వామా దాడి తర్వాత సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

READ MORE: CM Revanth Reddy: డల్లాస్ లో సీఎం రేవంత్‌ రెడ్డి.. హైదరాబాద్ లో ఛార్లెస్ స్క్వాబ్ కంపెనీపై చర్చ..

బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్‌ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. యూపీ మామిడిపండ్లు అంటే ఇష్టం లేదని రాహుల్‌ గాంధీ కొంతకాలం క్రితం చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. “పాకిస్థాన్ వారికి మామిడి పండ్లను పంపింది. యూపీ కంటే పాకిస్థాన్‌ నుంచి వచ్చిన మామిడిపండు ఇష్టమా? రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. మోడీని తొలగించడాని యత్నిస్తున్నారా? దానిలో భాగంగా కొత్తగా పాక్ తో చర్చలు జరపడానికి అక్కడికి వెళ్లారా?” అని ప్రశ్నించారు.

READ MORE:Vijay-TVK Party: తిరుచ్చిలో‌ భారీ బహిరంగ సభ.. పార్టీ అజెండాను ప్రకటించనున్న విజయ్!

దీనిపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా స్పందించారు. “ఏ ప్రదేశాన్ని ప్రేమిస్తున్నారో అక్కడ నుంచి మామిడిపళ్లు వస్తాయి. ఉత్తరప్రదేశ్‌లోని మామిడిపండ్లలో కొందరు తప్పులు కనుగొన్నారు. అవి రుచిగా లేవు. ఉత్తరప్రదేశ్‌లోని మామిడిపండ్లలోని తీపిని ఇష్టపడని రాహుల్ గాంధీ పాకిస్థాన్‌లోని మామిడిపండ్లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు.” అని వ్యాఖ్యానించారు. మామిడి పండ్లను పంపడంపై బీజేపీ నేత అమిత్ మాల్వియా కూడా ప్రశ్నలు సంధించారు.