రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. రెండు దేశాల నుంచి హింసాత్మక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల ఉక్రెయిన్ మాస్కోపై ప్రతీకారం తీర్చుకుంది. దీని కారణంగా రష్యా రెచ్చిపోయింది. ఉక్రెయిన్ పై రష్యా క్షిపణులు, డ్రోన్లు, రాకెట్ల వర్షం కురిపిస్తోంది.
రష్యా క్షిపణి దాడుల తర్వాత ఉక్రెయిన్‌లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఎంతలా అంటే ఓ చిన్నారికి ఉక్రేనియన్ వైద్యులు చీకట్లో గుండె చికిత్స చేయాల్సిన పరిస్థితి నెలకొంది.