Exotic Animals Seized: అక్రమంగా తరలిస్తున్న 665 అరుదైన, అన్యదేశ జంతువులు సీజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Exotic Animals Seized: మహారాష్ట్రలో అక్రమంగా తరలిస్తున్న అరుదైన, అన్యదేశ జీవులను అధికారులు సీజ్ చేశారు. జీవులను అక్రమంగా తరలిస్తు్న్నట్లు సమాచారం అందుకున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు వెంటనే రైడ్ చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు. డీఆర్ఐకి చెందిన ముంబయి యూనిట్ అధికారులు వీటిని పట్టుకున్నారు. ముంబైలోని ఎయిర్ కార్గో కాంప్లెక్స్‌లో దిగుమతి సరుకులో వీటిని గుర్తించారు.
Welcome to Delivery Boy: జొమాటో డెలివరీ బాయ్‌కు ఘన స్వాగతం.. హారతిచ్చి మరీ.. కారణమేంటో?
Also Read
- Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
దిగుమతి చేసుకునే సరుకులో దిగుమతి నిషేధించబడిన అరుదైన మరియు అన్యదేశ జాతులు ఉండవచ్చని సమాచారం అందిందని డీఆర్ఐ తెలియజేసింది. ఈ నేపథ్యంలో అధికారులు రైడ్ చేయగా.. కొండచిలువలు, తాబేళ్లు, బల్లులు సహా మొత్తం 665 జీవులు ఉన్నాయి. కొన్ని అత్యంత అరుదుగా కనిపించే విలక్షణ జాతుల జీవులు కూడా పట్టుబడ్డాయి. నిందితులు చేపలను తరలించే పెట్టెల్లో ఈ జీవులను దాచి అక్రమంగా ముంబైకి తరలించినట్లు అధికారులు చెప్పారు. అటవీ శాఖ, వన్యప్రాణి క్రైమ్ కంట్రోల్ బ్యూరో అధికారుల ఆధ్వర్యంలో ఈ దాడి జరిగింది. డీఆర్ఐ ప్ర ప్రకారం, జంతువులను దేశంలోకి అక్రమంగా తరలించడానికి ప్రయత్నించినందున, కస్టమ్స్ చట్టం, విదేశీ వాణిజ్య అభివృద్ధి (నియంత్రణ) చట్టం కింద జంతువులను స్వాధీనం చేసుకున్నారు. జీవులను సీజ్ చేసిన అధికారులు.. వాటిని బయటి నుంచి ముంబైకి తీసుకొచ్చిన వ్యక్తిని, ముంబైలో డెలివరీ తీసుకోబోయే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కేసులో తదుపరి విచారణ కొనసాగుతుందని చెప్పారు.
తాజావార్తలు
-
Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
-
Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
-
INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
-
Honda UC3 Electric Scooter: 122KM రేంజ్, 3.2kWh బ్యాటరీతో హోండా UC3 ఎలక్ట్రిక్ స్కూటర్.. భారత్‌లో రిలీజ్ కు రెడీ..!
-
Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!