Atrocity in temple: కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణ మైన ఘటన వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని అమృతహళ్లిలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఓ మహిళపై దాడి సంచలనంగా మారింది. అమె గుడిలో వుండగా ఆమెపై దాడి చేశారు. బయటకు వెళ్లాలని సూచించారు అయితే ఆమె వెళ్లనని తెలుపడంతో.. ఆమె జట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లాడు. విచక్షణారహితంగా ఆమెను కొట్టాడు. ఇదంతా గుడిలోనే జరగడం గమనార్హం. అయితే ఇది చూస్తున్న ఆలయంలోని వారు కూడా చోద్యం చూస్తుం వుండటం సర్వత్రా చర్చకు దారితీస్తోంది. గడిలో ఒక మహిళపై ఇలా దాడి చేస్తున్నా ఎవరూ కూడా ఆపకపోవడం బయటకు తీసుకు వెళ్లండి అంటూ చెప్పడం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓమహిళ ఆలయంలోని మరో వ్యక్తితో మాట్లాడుతూ మాట మాట పెరిగి ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడం చూడవచ్చు. మహిళ ఆలయం లోపల ఉంటానని పట్టుబట్టినట్లు కనిపిస్తుంది.
కాగా.. దీని ఆగ్రహానికి లోనైన అతడు ఆమెను బయటకు వెళ్లగొడతాడు. మహిళ ప్రతిఘటించడంతో ఆమెను తీవ్రంగా కొడతాడు. అంతేకాకుండా ఆమెను జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి బయటకు పడేస్తాడు. మరో ఇద్దరు పూజారులు కూడా ఈ వీడియోలో కనిపిస్తారు. అంతేకాదు బయటపడేయడమే కాకుండా.. ఆలయం బయటకు తీసుకొచ్చిన తర్వాత నిందితుడు కర్రతో కొట్టేందుకు ప్రయత్నించగా, అక్కడున్న ఒక పూజారి అతడ్ని అడ్డుకుంటాడు. ఆయన్ను పక్కన నెట్టి ఆగకుండా ఆమెపై దాడి చేస్తాడు. ఆమె లోనికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే.. పూజారులు కూడా అడ్డుకోవడం విడ్డూరంగా అనిపిస్తుంది. అయితే.. ఇదంతా ఎందుకు అని అనిమానాలు వ్యక్తమవుతున్న సమయంలో బాధితురాలు దళిత మహిళ ఆమెను ఆలయంలోనికి రాకుండా ఈదాడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే.. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈవిధంగా ఒక మహిళపై దాడిచేసిన వారిపై కఠినంగా శిక్షించాలని డిమాండ్లు చేస్తున్నారు. ఇది వీడియో వైరల్ కావడంతో ఘటనపై స్పందించిన పోలీసులు, నిందితులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Kamareddy Master Plan: నేడు మూడో రోజు రైతుల ఆందోళన.. రేవంత్ రెడ్డి పర్యటనపై ఉత్కంఠ