బ్యాంక్ ఖాతా యాక్టివ్ గా ఉండాలంటే బ్యాంక్ రూల్స్ ను పాటిస్తూ ఉండాలి. లావాదేవీలు జరపడం, మినిమం బ్యాలెన్స్ మెయిన్ టైన్ చేయడం మర్చిపోకూడదు. కనీస బ్యాలెన్స్ ఒక్కో బ్యాంకులో ఒక్కోరకంగా ఉంటుంది. అర్భన్, రూరల్ ప్రాంతాల్లో వేర్వేరుగా ఉంటుంది. మినిమం బ్యాలెన్స్ లేకపోతే బ్యాంకులు భారీగా జరిమానాలు విధిస్తుంటాయి. తాజాగా డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ (DBS) ఇండియా తన కస్టమర్లకు బిగ్ షాక్ ఇచ్చింది. ఖాతాలో ప్రతి నెలా కనీసం 10 వేల రూపాయలు మెయిన్ టైన్ చేయకపోతే, భారీ జరిమానా విధిస్తామని బ్యాంక్ తన ఖాతాదారులకు ఆదేశం జారీ చేసింది. ఈ జరిమానా మిగిలిన బ్యాలెన్స్‌లో 6 శాతం లేదా గరిష్టంగా రూ. 500 వరకు ఉండవచ్చని తెలిపింది.
Also Read:YS Jagan: ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తుందో సీఎం చంద్రబాబు చెప్పాలి!
DBS బ్యాంక్ ఇండియా వెబ్‌సైట్ ప్రకారం, ఆగస్టు 1, 2025 నుంచి, సగటు నెలవారీ బ్యాలెన్స్ నిర్వహించనందుకు బ్యాలెన్స్‌లో 6% ఫైన్ ఉంటుంది. గరిష్ట పరిమితి రూ. 500. ఈ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాకు సగటు నెలవారీ బ్యాలెన్స్ (AMB) రూ. 10,000. DBS బ్యాంక్ తన కస్టమర్లతో SMS ద్వారా కూడా సమాచారాన్ని పంచుకుంది. ఆగస్టు 1, 2025 నుంచి, మీ పొదుపు ఖాతా రకాన్ని బట్టి నాన్-మెయింటెనెన్స్ ఛార్జ్ మారుతుందని DBS ఇండియా తన వెబ్‌సైట్‌లో తెలిపింది. ఇప్పుడు ఖాతాదారులు మునుపటి కంటే ఎక్కువ సగటు నెలవారీ బ్యాలెన్స్‌ను నిర్వహించనందుకు ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. RBI ATM ఛార్జీల పెంపును ఆమోదించింది.
Also Read:Controversy Marriage: సభ్యసమాజానికి షాక్: 65ఏళ్ల అమ్మమ్మను పెళ్లి చేసుకున్న 21ఏళ్ల మనవడు!
ఇది మే 1, 2025 నుంచి అమలులోకి వస్తుంది. RBI నోటిఫికేషన్ తర్వాత, ఉచిత లావాదేవీ పరిమితి ముగిసిన తర్వాత DCB బ్యాంక్ ప్రతి ATM నగదు లావాదేవీపై గరిష్టంగా రూ. 23 రుసుము విధించింది. ఇతర బ్యాంకుల మాదిరిగానే, ఉచిత లావాదేవీలు ముగిసిన తర్వాత DBS బ్యాంక్ కాని ప్రతి ATM నగదు ఉపసంహరణ లావాదేవీపై DBS బ్యాంక్ కూడా రూ. 23 రుసుము వసూలు చేస్తోంది. అయితే, మీకు DCB బ్యాంక్‌లో ఖాతా ఉండి, DBS బ్యాంక్ ATM నుంచి విత్‌డ్రా చేస్తే, అది ఉచితం. మీరు ఎటువంటి ఛార్జీ లేకుండా అపరిమితంగా నగదు విత్ డ్రా చేసుకోవచ్చు.