YS Jagan: ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తుందో సీఎం చంద్రబాబు చెప్పాలి!
- చంద్రబాబు ప్రభుత్వానికి ఆర్ధిక క్రమశిక్షణ లేదు
- ఏపీఎండీసీ ద్వారా మరలా అప్పులు చేశారు
- డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తుందో చంద్రబాబు చెప్పాలి
- ఎక్స్‌లో మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం చంద్రబాబు నాయుడు సర్కార్ మరోసారి రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందంటూ ఎక్స్‌లో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు ప్రభుత్వానికి ఆర్ధిక క్రమశిక్షణ లేదని, అడ్డగోలుగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీఎండీసీ ద్వారా నిన్న కూడా బాండ్లు జారీ చేశారని, రూ.5526 కోట్లను బాండ్ల జారీ ద్వారా అప్పులు చేశారన్నారు. రానున్న రోజుల్లో మరలా ఏపీఎండీసీ ద్వారా అప్పులు చేయటానికి సిద్దమయ్యారని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తుందో సీఎం చంద్రబాబు చెప్పాలన డిమాండ్ చేశారు.
Also Read: Ration Shops: రేషన్ షాప్‌ల వద్ద ‘క్యూఆర్ కోడ్’ పోస్టర్లు.. ఫిర్యాదులు స్వీకరించబడును!
Also Read
‘చంద్రబాబు ప్రభుత్వానికి ఆర్ధిక క్రమశిక్షణ లేదు. అడ్డగోలుగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఏపీఎండీసీ ద్వారా మళ్లీ నిన్న కూడా బాండ్లు జారీ చేశారు.రూ.5,526 కోట్లను బాండ్ల జారీ ద్వారా అప్పులు చేశారు. గతంలోనే ఈ రాజ్యాంగ ఉల్లంఘనపై హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ ఏపీఎండీసీ ద్వారా మరలా అప్పులు చేశారు. రానున్న రోజుల్లో మళ్లీ మళ్లీ ఏపీఎండీసీ ద్వారా అప్పులు చేయటానికి సిద్దమయ్యారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రైవేట్ వ్యక్తులు నేరుగా ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు డ్రా చేయటానికి వీల్లేదు. కానీ చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్ పార్టీలే నేరుగా నిధులు డ్రా చేసుకునేలా అవకాశం కల్పించింది. ఇది రాజ్యాంగం లోని ఆర్టికల్స్ 203, 204, 293(1) నిబంధనల ఉల్లంఘనే. 9 వేల కోట్ల అప్పుల కోసం ఏపీఎండీసీకి చెందిన 1.91 లక్షల కోట్ల విలువైన గనులను తాకట్టు పెట్టటం దారుణం. అధిక వడ్డీలకు అప్పులు తీసుకురావటం ద్వారా ఏపీఎండీసీపై సంవత్సరానికి రూ.235 కోట్ల అదనపు భారం పడుతోంది. ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తుందో చంద్రబాబు చెప్పాలి. మా హయాంలో ఐదేళ్లలో చేసిన అప్పుల్లో సగం చంద్రబాబు ఈ ఏడాదిలోనే చేశారు’ అని వైఎస్ జగన్ ఎక్స్‌లో రాసుకొచ్చారు.
Andhra Pradesh Government’s lack of fiscal discipline and disregard for the Constitutional framework.
It is learnt that, on 25th June, 2025, APMDC concluded the second tranche of its NCD (bond) issuance at a coupon (interest) rate of 9.30% and raised Rs. 5,526 crores, taking the… pic.twitter.com/wiJSs6q1lK
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 26, 2025
- Tags
- ap
- apmdc
- bonds
- cm chandrababu
- ycp
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?