సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు కనపడుతుంటాయి. ఇందులో అనేక ఉపయోగకరమైన వీడియోలు కూడా కనపడతాయి. ఇందులో కొన్ని విడియోలైతే కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. తాజాగా అలాంటి ఓ అబ్బురపరిచే వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఈ వీడియో ఇప్పుడు చాలామంది నెటిజన్స్ దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియోలో ద్వారా సాఫ్ట్ డ్రింక్ క్యాన్లలో సీక్రెట్ ప్లాస్టిక్ లైనింగ్ ఉంటుందన్న విషయం తేలింది.
also read: Viral Video: మార్కెట్ లోకి దూసుకెళ్లిన ట్యాక్సీ డ్రైవర్.. ఒకరి మృతితో పాటు..?
ఇకపోతే ఈ విషయం కూల్ డ్రింక్స్ ఇండస్ట్రీలో పని చేసే వారికి లేదా పరిశోధకులకు కొత్త ఏమి కాదు. కాకపోతే చాలా మంది సామాన్య ప్రజలకు మాత్రం ఇది ఆశ్చర్యపరిచే విషయమిది. మాములుగా సాఫ్ట్ డ్రింక్స్ క్యాన్లను అల్యూమినియం మెటల్ తో తయారు చేస్తారని మనకి తెలిసిందే. కాకపోతే ఈ అల్యూమినియం లోహం డ్రింక్స్ లోని ఎసిడిక్ కంటెంట్స్ తో రియాక్ట్ అవొచ్చు. దీని కారణంగా కూల్ డ్రింక్ కి లోహపు రుచి వచ్చే అవకాశము లేకపోలేదు. అంతేకాదు ఒక్కోసారి అల్యూమినియం రేణువులు డ్రింక్ లో కూడా కలవచ్చు.
also read: Viral Video : అనారోగ్యానికి గురైన కేర్ టేకర్ ను చూసేందుకు ఆస్పత్రికి వచ్చిన ఏనుగు
ఇలాంటివి జరగకుండా ఉండేందుకు తయారీ కంపెనీలు డబ్బాల లోపలి భాగంలో ఓ సన్నని ప్లాస్టిక్ లైనింగ్ ను ఉంచుతారు. ఈ ప్లాస్టిక్ లైనింగ్ ఒక ఎపాక్సి రెసిన్. ఈ ప్లాస్టిక్ ఎపాక్సి రెసిన్ బాటిల్ లోని డ్రింక్, మెటల్ మధ్య ఒక షీల్డ్ లాగా పనిచేస్తుంది. అంతేకాదు ఇలా ఉండడం ద్వారా డబ్బాకు కూడా తుప్పు పట్టకుండా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ కూల్ డ్రింక్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.