మోడల్ మోడల్ సూపర్ మోడల్ అంటూ సోషల్ మీడియాలో ఈ డైలాగ్ మస్త్ వైరల్ అయింది. అయితే, బ్రెజిల్‌కు చెందిన ఓ మోడల్ బికినీ డ్రెస్‌లో ఎయిర్‌పోర్టుకు వచ్చింది. ఆ మోడల్ విపరీత స్వభావానికి ఎయిర్ పోర్ట్ సిబ్బంది ఖంగుతిన్నారు. దీంతో ఆమెను బోర్డింగ్ ఎంట్రీ దగ్గర అడ్డుకున్నారు. సరైన దుస్తులు ధరిస్తేనే విమానంలోకి వెళ్లాల్సి ఉంటుందని వారి క్లారిటీ ఇచ్చారు. సెక్యూరిటీ సదరు మోడల్ డ్రెస్ ఛేంజ్ చేసుకోని రావాలని పట్టువీడకపోవడంతో ఆ మోడల్ ఎట్టకేలకు వెనుదిరిగిపోయింది. తనకు ఎదురైన కష్టాన్ని సోషల్ మీడియాలో ఆ మోడల్ పంచుకుంది.
Read Also: Rahul Gandhi Bike Trip: క్యా రాహుల్ జీ.. వాట్ ఏ స్టైలిష్ లుక్
అయితే, బ్రెజిల్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న కేన్ చాన్‌ను ఇన్‌స్టాగ్రామ్ లో 6 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. నిత్యం ఈవెంట్‌లతో బిజీగా ఉండే ఈ మోడల్.. బ్రెజిల్‌లోని నవేగాంటెస్ ఎయిర్‌పోర్టుకు బికినీలో పోయింది. కేవలం నల్లని బికినీ, విగ్, నల్లని షాండిల్స్‌ను వేసుకుంది. ఇది అచ్చం అనిమే వెబ్ సిరీస్ సైబర్ ఫంక్‌లోని రెబక్కా వేషధారణలాగే ఉందని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read Also: Nadipelli Diwakar Rao: మంచిర్యాలను ముంచెత్తిన సంబరాలు
ఇక, మోడల్ వేషధారణ చూసిన ఎయిర్‌పోర్టు సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. ఇలాంటి బట్టలు వేసుకుంటే.. విమానానికి అనుమతించబోమని తెలిపారు. శరీరాన్ని కప్పుకునే దుస్తులు ధరించాలని వారు కోరారు. అయితే.. ఈవెంట్‌కు ఆలస్యం అవుతున్న కారణంగానే తాను అలాంటి డ్రెస్ వేసుకోవాల్సి వచ్చిందని కేన్ చాన్ వెల్లిడించింది. టైం వృథా చేయలేక ఈవెంట్‌కు సంబంధించిన దుస్తులు వేసుకున్నట్లు చెప్పుకొచ్చింది.
Read Also: Snake Gourd: పొట్లకాయ సాగులో అధిక లాభాలకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
దీంతో.. కేన్ చాన్ పోస్టుపై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. కొందరు మోడల్‌కు సపోర్ట్ ఇస్తుంటే.. మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. సమాజంలో కనీస విలువల్ని కాపాడాలని, దుస్తులు సరిగ్గా వేసుకోవాలని మోడల్‌ను కోరారు. కొన్నిసార్లు ఈవెంట్ల మధ్య చాలా తక్కువ టైం ఉంటుందని, ఇలాంటి పరిస్థితి అప్పుడప్పుడు ఎదురవుతుందని ఇంకొందరు ఆమెకు మద్దతుగా నిలిచారు.