Upasana Konidela: మెగా కోడలు ఉపాసన కొణిదెల నుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భార్యగా, కోడలిగా, ఇప్పుడు క్లింకాకు తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. ఇంకోపక్క అపోలో హాస్పిటల్స్ ను నడిపిస్తూ బిజినెస్ రంగంలో కూడా దూసుకుపోతుంది. అపోలో హాస్పిటల్స్ కు వైస్ చైర్ పర్సన్ గా తనవంతు కృషి చేస్తోంది. హైదరాబాద్ లోనే కాదు దేశం అంతటా అపోలో హాస్పిటల్స్ ఎంత మంచి గుర్తింపును తెచ్చుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ మధ్యనే ఉపాసన.. సింగిల్ మదర్స్ కోసం హెల్త్ చెకప్స్ ను ఫ్రీగా చేసే అవకాశాన్ని కల్పించింది. ఇక తనను ఇంత గొప్పదానిగా చేసిన అమ్మమ్మను తాతయ్యను ఆమె ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను అని ఎన్నోసార్లు చెప్పుకొచ్చింది. అంతేకాకుండా.. తాను ఇలా ఉండడానికి కారణం వారేనని.. చిన్నతనం నుంచి వారి స్ట్రగుల్స్ చూశానని.. తమ కుమార్తెను కూడా వారు పిల్లలను ఎలా పెంచారో అలానే పెంచాలని కోరుకుంటున్నామని కూడా చెప్పుకొచ్చింది.
Miss Shetty Mr Polishetty Trailer: పెళ్లి వద్దు.. ప్రెగ్నెంట్ కావాలి అంటున్న అనుష్క
ఇక ఈ నేపథ్యంలోనే ఆమె తన అమ్మమ్మ పుట్టినరోజుకు పెద్ద గిఫ్ట్ ను ఇచ్చింది. హైదరాబాద్ లోని నానక్‌రామ్‌గూడ లో అపోలో కొత్త బ్రాంచ్ ను ఓపెన్ చేసి.. అది అమ్మమ్మకు అంకితం చేసింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. “ఈ రోజు మేము మా అమ్మమ్మ పుట్టినరోజును జరుపుకుంటున్నాం. వినయం, షరతులు లేని ప్రేమ, ఎంతో గొప్ప దయ ఉన్న అమ్మమ్మకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఆమె ప్రత్యేక పుట్టినరోజు సందర్భంగా, మేము అపోలో హాస్పిటల్స్ నానక్‌రామ్‌గూడకు భూమి పూజ నిర్వహించాము.. త్వరలోనే హాస్పిటల్ తెరవబడుతుంది” అని తెలిపింది. అంతే కాకుండా అమ్మమ్మ తో దిగిన ఫోటోను కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోస్, వీడియో నెట్టింట వైరల్ గా మారింది.