వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏకు 400 సీట్లు ఇవ్వాలంటూ ప్రధాని మోడీ ప్రతీ సభల్లో విజ్ఞప్తి చేస్తు్న్నారు. రోడ్ షోలోనైనా, బహిరంగ సభల్లోనైనా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో మోడీ పర్యటిస్తు్న్నారు. ఈ పర్యటనలో 400 సీట్లు ఇవ్వాలని ప్రజలకు మోడీ పిలుపునిచ్చారు.
అభివృద్ధి, అవినీతి విముక్త భారత్ కోసమే 400 ప్లస్ సీట్లను బీజేపీ అడుగుతోందని కర్ణాటకలోని శివమొగ్గలో ప్రధాని తెలిపారు. అధికారం కోసం ఎంతదూరం వెళ్లడానికైనా కాంగ్రెస్ సిద్ధపడుతుందని ఆ పార్టీపై మోడీ విమర్శలు గుప్పించారు. బ్రిటిషర్లు దేశాన్ని విడిచివెళ్లినా, విభజించు-పాలించు అనే బ్రిటిషర్ల మనస్తత్వం మాత్రం కాంగ్రెస్‌కు పోలేదని ఎద్దేవా చేశారు.
దేశాన్ని కులం, మతం, ప్రాంతం, భాషల పరంగా విభజించి అధికారం అనుభవించినా, విభజన కాంక్ష మాత్రం కాంగ్రెస్‌కు తీరలేదన్నారు. కాంగ్రెస్ మళ్లీ దేశాన్ని విభజించాలనే ప్రమాదకరమైన ఆట మొదలుపెట్టిందని, వారి అభిప్రాయాలను ఇప్పుడు బహిరంగంగానే చెబుతున్నారని మోడీ తప్పుపట్టారు. దేశం మరోసారి విడిపోతుందని ఇటీవలే కర్ణాటక ఎంపీ ఒకరు వ్యాఖ్యానించారని, అలాంటి ఎంపీని పార్టీ నుంచి విసిరిపారేయకుండా కాంగ్రెస్ పార్టీ అతనికి బాసటగా నిలుస్తోందన్నారు. అలాంటి రాజకీయాలు, కుట్రలను కర్ణాటక ప్రజలు ఎప్పటికీ విజయవంతం కానీయరని మోడీ ధీమా వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా 7 విడతల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1న పోలింగ్ ముగియనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు.. శక్తి వివాదంపై క్లారిటీ
#WATCH | Shivamogga, Karnataka: PM Narendra Modi says, "4 June ko 400 paar. Karnataka voters have a big responsibility in this mission. Why are we talking about 400 seats? 400 paar for Viksit Bharat, Viksit Karnataka…" pic.twitter.com/2qdKjwcA9L
— ANI (@ANI) March 18, 2024