బీహార్ రాజధాని పాట్నాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ (బిజెపి) నినాదం ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఎలా ఉంది. బీజేపీ 400 సీట్ల దాటడం గురించి, వివిధ అంశాలపై బహిరంగంగా మాట్లాడారు. థర్డ్ ఫేజ్ ఎలక్షన్స్ తర్వాత 'అబ్కీ బార్, 400 పార్' నినాదం వాస్తవరూపం దాల్చిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏకు 400 సీట్లు ఇవ్వాలంటూ ప్రధాని మోడీ ప్రతీ సభల్లో విజ్ఞప్తి చేస్తు్న్నారు. రోడ్ షోలోనైనా, బహిరంగ సభల్లోనైనా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు.